'హిట్ మ్యాన్' అనే పేరు నాకు చాలా ఇష్టం: రోహిత్ శర్మ

హైదరాబాద్: హిట్ మాన్ అని పిలిపించుకోవడం తనకు చాలా ఇష్టమట. ఈ విషయాన్ని రోహిత్ శర్మే స్వయంగా చెప్పుకొచ్చాడు. భారత క్రికెటర్ రోహిత్ శర్మను సహచర ఆటగాళ్లు, అభిమానులు 'హిట్ మ్యాన్' అని ముద్దుగా పిలుచుకుంటారు. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలో ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న టీమిండియా తొలి సిరీస్‌ను విజయంతో ముగించింది. టీ20 సిరీస్ నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి సెంచరీతో జట్టును గెలిపించాడు.

మ్యాన్ ఆఫ్ మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కైవసం
దీంతో మ్యాన్ ఆఫ్ మ్యాచ్‌తో పాటు మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌ను కైవసం చేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ ఇలా స్పందించాడు. ‘నన్ను చాలా మంది ‘హిట్‌మ్యాన్' అని ముద్దుగా పిలుచుకుంటారు. నిజానికి ఈ పేరంటే నాకు చాలా ఇష్టం' అని తెలిపాడు.

మూడు సెంచరీలు నాకెంతో ప్రత్యేకం
అనంతరం తాను సాధించిన సెంచరీ గురించి మాట్లాడుతూ..‘టీ20ల్లో ఇప్పటి వరకు నేను మూడు సెంచరీలు సాధించాను. ఈ మూడు నాకెంతో ప్రత్యేకం. ఏ ఒక్కటి మరో దాని కంటే గొప్పదని చెప్పలేను. ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. భవిష్యత్తులో మరిన్ని సెంచరీలు సాధించాలి.

రోహిత్ భార్య చూస్తున్న సమయంలోనే సెంచరీ
చాలా మంది రితిక(రోహిత్ భార్య) గ్యాలరీలో కూర్చుని మ్యాచ్ చూస్తున్న సమయంలోనే సెంచరీ సాధిస్తానని అనుకుంటారు. కానీ, ఇప్పుడు ఇక్కడ రితిక లేదు. ఆమె టీవీలో మ్యాచ్ చూసి ఉండొచ్చు. కొద్ది రోజుల్లో ఆమె ఇక్కడికి వస్తుంది. రితిక ఎప్పుడెప్పుడు ఇక్కడికి వస్తుందా అని ఎదురుచూస్తున్నాను' అని నవ్వుతూ చెప్పాడు రోహిత్.

టీ20 సిరీస్ సొంతం, జట్టు విజయంలో కీలకపాత్ర:
ఇంగ్లాండ్‌పై టీ20 సిరీస్ సొంతం చేసుకోవడం, ఆ జట్టులో నాకు చోటు దక్కడం, జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడం చాలా సంతోషంగా ఉందని రోహిత్ అన్నాడు. అనంతరం మూడో వన్డేలో తాను సాధించిన సెంచరీని రోహిత్ ఈ ఏడాది మార్చిలో కెన్యాలో మృతి చెందిన తెల్లని ఖడ్గమృగం ‘సూడాన్'కు అంకితమిస్తున్నట్లు తెలిపాడు. పర్యటనలో భాగంగా భారత్-ఇంగ్లాండ్ మధ్య ఈ నెల 12 నుంచి వన్డే సిరీస్ ప్రారంభంకానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications