Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'క్రికెట్ కెరీర్లో కోహ్లీ కంటే అత్యుత్తమ ప్లేయర్‌ని చూడలేదు'

I haven’t seen a better player than Virat Kohli, says Michael Vaughan

పెర్త్: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా కెప్టెన్‌పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. ఆసీస్ ఆటగాళ్లు కవ్విస్తున్నా.. తనదైన శైలిలో ఆడుకుంటూ పోతున్నాడే తప్ప వివాదాలకు దిగడం లేదంటూ వెనకేసుకొచ్చాడు. తనకు క్రికెట్ కెరీర్లో విరాట్ కోహ్లీ కంటే ఉత్తమమైన ప్లేయర్ కనిపించలేదని వెల్లడించాడు. దాని ఉద్దేశ్యం దిగ్గజ క్రికెటర్లను తక్కువ చేయడం కాదని వారి కంటే కోహ్లీ అత్యుత్తమ ప్లేయర్ అని వ్యాఖ్యానించాడు. ఆసీస్‌తో రెండో టెస్టులో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ 25వ సెంచరీ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.

కోహ్లీ కంటే బెస్ట్ ప్లేయర్‌ని చూడలేదు

కోహ్లీ కంటే బెస్ట్ ప్లేయర్‌ని చూడలేదు

'విరాట్ కోహ్లీ కంటే బెస్ట్ ప్లేయర్‌ని చూడలేదు. అంటే దాని ఉద్దేశ్యం సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా, రిక్కీ పాంటింగ్‌లను అవమానించినట్లు కాదు. మూడు ఫార్మాట్లలో విరాట్ కోహ్లీ కంటే ఉత్తమంగా ఆడే ప్లేయర్‌ లేడు' అంటూ మీడియా సమావేశంలో చెప్పుకొచ్చాడు. 'జట్టు ఒత్తిడిలో ఉన్న సమయంలో అతను మానసిక స్థాయిలోనూ నైపుణ్యంలోనూ అత్యున్నత స్థాయిలో నిలబడి ఉంటాడు. అంచనాల మేర రాణించే విషయంలో ఒక్క సచిన్ మాత్రమే కోహ్లీతో పోటీపడగలడు.' అని పేర్కొన్నాడు.

టెండూల్కర్ 17ఏళ్ల నాటి రికార్డును అధిగమించి

టెండూల్కర్ 17ఏళ్ల నాటి రికార్డును అధిగమించి

గత నెలలో సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లలో మూడు వన్డే సెంచరీలను బాదేసి పది వేల పరుగుల క్లబ్‌లో చేరాడు. ఇలా టెండూల్కర్ 17ఏళ్ల నాటి రికార్డును అధిగమించడమే కాక, వన్డే కెరీర్‌లో 38 హాఫ్ సెంచరీలు, సాధించాడు. ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియా పర్యటనలోనూ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడి 25వ టెస్టు సెంచరీని సాధించాడు.

 తొలి భారత క్రికెటర్‌గా రికార్డు

తొలి భారత క్రికెటర్‌గా రికార్డు

టెస్టు కెరీర్‌లో కోహ్లీకి ఇది 25వ సెంచరీ కాగా.. ఆస్ట్రేలియాపై 7వ సెంచరీ. 76 మ్యాచ్‌లు.. 128 ఇన్నింగ్స్‌లో కోహ్లి ఈ ఘనత సాధించగా.. దిగ్గజ క్రికెటర్‌ బ్రాడ్‌మన్‌ 52 మ్యాచ్‌లు.. 68 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. భారత దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ 130 ఇన్నింగ్స్‌ల్లో.. మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ 138 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను అందుకొని కోహ్లి తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక కోహ్లి రికార్డును అధిగమించడానికి ఆసీస్‌ క్రికెటర్‌ స్టీవ్‌స్మిత్‌కే అవకాశం ఉంది. 117 ఇన్నింగ్స్‌ల్లోనే 23 సెంచరీలు పూర్తి చేసిన స్మిత్‌.. బాల్‌ట్యాంపరింగ్‌ వివాదంతో ఆటకు దూరమైన విషయం తెలిసిందే.

Story first published: Monday, December 17, 2018, 17:54 [IST]
Other articles published on Dec 17, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+