వేరే చాయిస్ లేదు.. జట్టులో నాది ఆరో స్థానమనే ఫిక్స్ అయ్యా: మనీష్ పాండే

వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో భారత్ సూపర్ ఓవర్‌లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇరు జట్ల స్కోర్లు సమమైన మ్యాచ్‌లో విజేతను నిర్ణయించే సూపర్ ఓవర్‌లో టీమిండియా విజయాన్ని సొంతం చేసుకుంది. నాలుగో టీ20లో శార్దూల్ ఠాకూర్ వేసిన చివరి ఓవర్ మ్యాచ్‌కే హైలెట్ అయింది. కివీస్ 7 పరుగులు చేయాల్సిన తరుణంలో 6 పరుగులే ఇచ్చి రెండు వికెట్లను సాధించి మ్యాచ్‌ను టై చేయడంలో శార్దూల్ కీలక పాత్ర పోషించాడు. ఇక సూపర్ ఓవర్‌లో లోకేష్ రాహుల్ (10), విరాట్ కోహ్లీ (6)లు బ్యాట్ ఝుళిపించి అద్భుత విజయాన్ని అందించారు.

అజేయ హాఫ్ సెంచరీ
న్యూజిలాండ్ ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచడంలో మనీశ్ పాండే (36 బంతుల్లో 50 నాటౌట్, 3 ఫోర్లు) కీలక పాత్ర పోషించాడు. కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సంజు సాంసన్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో టీమిండియాను పాండే ఆదుకున్నాడు. సరైన సమయంలో ఠాకూర్, సైనీల అండతో సమయోచితంగా బ్యాటింగ్ చేసి అజేయ హాఫ్ సెంచరీ సాధించాడు. 36 బంతుల్లో కేవలం మూడు ఫోర్లు బాదినా.. స్టైక్‌ను రొటేట్ చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. పాండే ఇన్నింగ్స్‌తోనే భారత్ 166 పరుగులను కివీస్ ముందు ఉంచింది.

ఆరో స్థానమనే ఫిక్స్ అయ్యా
మ్యాచ్ అనంతరం పాండే మాట్లాడుతూ... 'చాలా సంతోషంగా ఉంది. నా ఆట తీరుపై సంతృప్తిగా ఉన్నా. నేను ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి విలువైన పరుగులు చేయడం ఆనందంగా ఉంది. జట్టులో ఇప్పుడు నాది ఆరో స్థానమనే ఫిక్స్ అయ్యా. ఎందుకంటే.. ముందుగా రావడానికి నాకు చాయిస్ లేదు. ప్రస్తుతం ఆ స్థానం కోసమే సన్నద్ధమవుతున్నాం. నేను మూడు లేదా నాల్గో స్థానంలో బ్యాటింగ్ చేస్తా. అయితే ఇప్పుడు ఆ స్థానాల్లో పోటీ ఉంది. చాన్స్‌ల కోసం నిరీక్షించక తప‍్పదు' అని పాండే అన్నాడు.

డబుల్ హ్యాట్రిక్
30 ఏళ్ల మనీష్ పాండే టీ20ల్లో తన నాటౌట్ ప్రస్తానాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. న్యూజిలాండ్‌తో ప్రస్తుత సిరీస్‌లో ఇప్పటివరకూ ఔట్ కానీ పాండే.. అంతర్జాతీయ టీ20ల్లో వరుసుగా ఆరుసార్లు నాటౌట్‌గా నిలిచాడు. దీంతో నాటౌట్‌ల విషయంలో 'డబుల్ హ్యాట్రిక్' కొట్టాడు. పాండే గత ఆరు అంతర్జాతీయ మ్యాచ్‌ల స్కోర్లు (50 నాటౌట్, 14 నాటౌట్, 14 నాటౌట్, 31 నాటౌట్, 22 నాటౌట్, 2 నాటౌట్) ఇలా ఉన్నాయి.

మూడో స్థానంలో పాండే
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 46.40 యావరేజ్‌తో మనీష్ పాండే మూడో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్‌ల తర్వాత అత్యుత్తమ యావరేజ్ పాండేదే కావడం విశేషం. 2019 ఆగస్టు 3వ తేదీ నుంచి ఇప్పటివరకూ భారత్‌కు పాండే 9 సార్లు ప్రాతినిధ్యం వహించగా.. అందులో ఆరుసార్లు అజేయంగా ఉండటం మరొక విశేషం. ఇదే సమయంలో పాండే ఆడిన 9 మ్యాచ్‌ల్లో టీమిండియా గెలుపొందింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications