Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వీడియో వైరల్: సెహ్వాగ్ బట్టతల గురించి షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు

I have more money than you have hair on your head: Shoaib Akhtar takes a jibe at Virender Sehwag

హైదరాబాద్: 'సెహ్వాగ్‌ తలపై ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ డబ్బు నా దగ్గర ఉంది' తాజాగా పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలివి. తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో 2016లో వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలకు షోయబ్ అక్తర్ ఇప్పుడు సమాధానమిచ్చారు.

తన వ్యాపారం అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని షోయబ్ అక్తర్ భారత క్రికెట్‌తో పాటు భారత క్రికెటర్లను ఎంతగానో ప్రశంసిస్తాడని అప్పుడెప్పుడో సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. సెహ్వాగ్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా అక్తర్‌ మూడేళ్ల తర్వాత ఓ వీడియోను రూపొందించి తన యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్ట్‌ చేశాడు.

అందులో "నా స్నేహితుడు సెహ్వాగ్‌ గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియలో వైరల్‌ అవుతున్నాయి. డబ్బు, వ్యాపారం కోసమే అక్తర్‌ భారత క్రికెట్‌ గురించి మాట్లాడతాడని వ్యాఖ్యానించాడు. వీరూ భాయ్‌కు ఒక్కటే చెప్పదల్చుకున్నా. డబ్బు అనేది నాకు భారత్‌ ఇచ్చింది కాదు. ఆ భగవంతుడు ఇచ్చాడు" అని అన్నాడు.

"నీ తలపై ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ డబ్బే నా దగ్గర ఉంది. పదిహేనేళ్లు పాక్ తరుపున క్రికెట్ ఆడటంతో నాకు పేరు, ప్రఖ్యాతలతో పాటు డబ్బు సంపాదించుకున్నాను. ఇంకా డబ్బు కోసం ఎందుకు వెంపర్లాడుతాను. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓడిపోయిన తర్వాత నా అభిప్రాయాలు చెప్పాను" అని అక్తర్ అన్నాడు.

"సిరీస్‌ గెలిచాక కూడా మెచ్చుకున్నాను. అయితే, భారత్ ఓడిపోయినప్పుడు నేను చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా గతంలో ఎప్పుడో సెహ్వాగ్‌ అన్న మాటలను తాజాగా ఇప్పుడు హైలెట్‌ చేస్తున్నారు. అందుకే నేను చెప్పాల్సింది చెప్పాను. సెహ్వాగ్‌పై నాకు ఎలాంటి కోపం లేదు. మేమిద్దరం మంచి స్నేహితులం. సెహ్వాగ్‌ చాలా సరదా వ్యక్తి. సరదాగా వ్యాఖ్యలు చేస్తుంటాడు. అయితే ఆ వ్యాఖ్యలు కూడా సరదాగానే అని ఉంటాడని భావిస్తున్నా" అని అక్తర్ చివర్లో చెప్పడం కొసమెరుపు. అయితే, అక్తర్ వ్యాఖ్యలపై భారత క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Story first published: Thursday, January 23, 2020, 12:19 [IST]
Other articles published on Jan 23, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+