'వాళ్ల వీడియోలని చూసే బౌలింగ్ శైలి మార్చుకున్నా..'

లండన్: గత పర్యటనలతో పోలిస్తే.. ప్రస్తుత ఇంగ్లాండ్ పర్యటనలో అత్యుత్తమంగా రాణిస్తున్నానని మొహమ్మద్ షమీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. దీనికి కారణం ఇంగ్లాండ్ దిగ్గజ బౌలర్లు అయిన అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్‌ల బౌలింగ్ వీడియోలను చూడటమేనంటూ చెప్పుకొచ్చాడు. దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం సుదీర్ఘ పర్యటనలో భాగంగా ఇంగ్లాండ్‌తో ఆడుతున్న చివరి సిరీస్ అయిన టెస్టు ఫార్మాట్‌లో భాగంగా షమీ 16 వికెట్లు తీయగలిగాడు. ఈ విషయంపై షమీ ఇలా మాట్లాడాడు.

విదేశీ గడ్డలపై బౌలింగ్ ఎలా చేయాలా :
'గత ప్రదర్శనలతో పోలిస్తే నా ప్రదర్శనల్లో చాలా పరిణతి చెందాను. 2014వ సంవత్సరంలో ఇంగ్లాండ్‌లో పర్యటించిన సమయంలో ఇంతటి ప్రతిభను ప్రదర్శించలేకపోయా. విదేశీ గడ్డలపై బౌలింగ్ ఎలా చేయాలా అనే అంశంపై జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్‌ల బౌలింగ్‌లను చూసి నేర్చుకున్నా. ఏ ప్రదేశంలో బంతి వేస్తే ఎలా స్పందిస్తోందనే విషయాన్ని నిశితం పరిశీలించాను. అదే విధానాన్ని అమలు చేశాను'

తొలి నాటి నుంచే బ్యాట్స్‌మెన్ తడబడుతున్నా
షమీ ఆటతీరులోని మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో తన తొలి ఇన్నింగ్స్‌లో 0/72తో రెండో ఇన్నింగ్స్‌లో 2/110తో చక్కటి బౌలింగ్ చేశాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ భారత్‌కు 464 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ముందుంచారు. పర్యటన మొదలైన నాటి నుంచే భారత బ్యాట్స్‌మెన్ తడబడుతున్నా.. బౌలర్లు మాత్రం వెనుకడుగేయలేదు.

అదృష్టం కూడా కొన్ని సార్లు ఆటపై ప్రభావం
కొన్ని సార్లు మన అదృష్టం కూడా ఆటపై ప్రభావం చూపుతుంది. మనం ఎంతో కష్టపడి బౌలింగ్ వేస్తే సరిపోదు ఆ సమయానికి వికెట్ పడాలంటే దానికి జట్టు సహకారం కావాలి. కొన్ని సార్లు అసహనానికి గురి కావాల్సి వస్తుంది. సరిగ్గా ఐదో టెస్టు మొదటి ఇన్నింగ్స్ జరిగినట్లు అయితే ఏం చేయలేం. మామూలుగా అయితే మేమంతా చాలా సరదాగా ఉంటాం. కానీ, మైదానంలో దిగినప్పుడు మాత్రం వాతావరణమంతా మారిపోతుంది. ఆటపైనే ధ్యాస పెడతాం. మళ్లీ ఆట పూర్తాకాగానే రిలాక్స్ అయిపోతాం. ఆ మాత్రం సరదా, సంగీతంతో కాలక్షేపం చేయకపోతే ఒత్తిడిని జయించలేం కదా.'

బౌలింగ్‌తోనూ సత్తా చాటిన హనుమ విహారీ:
ఐదో టెస్టులోని నాలుగో రోజు ఇషాంత్ శర్మ కేవలం ఒకే ఓవర్ వేసి కాలు నొప్పితో మైదానం నుంచి వెనుదిరిగాడు. ఈ క్రమంలో షమీతో పాటుగా బరిలోకి దిగిన హనుమ విహారీ బ్యాట్‌తోనే కాదు. బౌలింగ్‌తోనూ సత్తా చాటాడు. ఇంగ్లాండ్ జట్టుకు 37 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. దీంతో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్ కష్టాల్లో చిక్కుకుంది. ఈ దశలో రాహుల్, రహానె సంయమనంతో ఆడారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications