సంజు శాంసన్ బ్యాటింగ్‌కు క్లీన్ బౌల్డ్: ఎవరా టీమిండియా మహిళా క్రికెటర్..ఏంటా కథ?

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ కొనసాగుతున్న కొద్దీ ప్రేమజంటలు ఒక్కటొక్కటిగా బయటికొస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ సీజన్‌లో యంగ్ క్రికెటర్లు రఫ్పాండించేస్తున్నారు. స్కోరు బోర్డు నిండా పరుగులు చేస్తున్నారు..రెండు చేతులా వికెట్లను పడగొడుతున్నారు. యంగ్ క్రికెటర్ల బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ను చూస్తూ ఫిదా అవుతున్నారు క్రికెట్ ప్రేమికులు. వారిపై తమకున్న ప్రేమను చాటుకుంటున్నారు.

శుభ్‌మన్ గిల్-సారా, ఇషాన్ కిషన్-ఆదితి
ఇప్పటికే- శుభ్‌మన్ గిల్-సారా టెండుల్కర్, ఇషాన్ కిషన్-ఆదితి హుందియాల ప్రేమ వ్యవహారం బాహ్య ప్రపంచానికి తెలిసిపోయింది. తాజాగా- సంజు శాంసన్, టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మధ్య ఏదో ఉందనే అనుమానాలు తలెత్తాయి. రాజస్థాన్ రాయల్స్ టీమ్ తరఫున సంజు శాంసన్ ఐపీఎల్-2020 సీజన్‌లో ఆడుతున్నాడు. ఎప్పట్లాగే ఈ సీజన్‌లో కూడా తనదైన శైలిలో దూకుడుగా ఆడుతున్నాడు సంజు. ఇప్పటిదాకా మూడు మ్యాచ్‌లు ఆడిన సంజు.. 167 పరుగులు చేశాడు.

బ్యాటింగ్‌కు స్మృతి ఫిదా..
అతని వ్యక్తిగత అత్యధిక స్కోరు 85 పరుగులు. 201.20 స్ట్రైక్ రేట్‌ను నమోదు చేశాడు. యావరేజ్ 55.66. బుధవారం రాత్రి కోల్‌కత నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిది పరుగులకే అతను అవుట్ అయ్యాడు. ఆ ఒక్క మ్యాచ్ వదిలేస్తే.. మిగిలిన రెండింట్లోనూ హాఫ్ సెంచరీ చేశాడతను. సంజు శాంసన్ బ్యాటింగ్ పట్ల టీమిండియా మహిళా జట్టు ఓపెనర్ స్మృతి మంధాన ఫిదా అయ్యారు. అతనికి బిగ్ ఫ్యాన్ అయ్యారామె. సంజు శాంసన్ కోసమే తాను రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సపోర్ట్ చేస్తున్నాననీ అన్నారు.

నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్..
గురువారం ఆమె ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. సంజు శాంసన్ బ్యాటింగ్ శైలి తనకు బాగా నచ్చిందని, అతని నుంచి స్ఫూర్తి పొందుతున్నానని చెప్పారు. సంజు బ్యాటింగ్ నెక్స్ట్ క్రికెట్ షాట్లను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లిందని అన్నారు. అతని షాట్లను తానూ ఆడే ప్రయత్నం చేస్తానని స్మృతి తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్‌లన్నింటినీ తాను రెగ్యులర్‌గా చూస్తున్నానని అన్నారు.

టాప్ క్రికెటర్ల సరసన..
విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేస్తుంటానని, అదే జాబితాలో సంజు శాంసన్ కూడా చేరాడని స్మృతి మంధాన చెప్పుకొచ్చారు. ఈ సీజన్ ముగిసే సరికి సంజు శాంసన్ అత్యుత్తమ క్రికెటర్‌గా ఎదుగుతాడని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నానని అన్నారు. టీమిండియాలో కూడా శాశ్వతంగా చోటు దక్కించుకోగలడని, సుదీర్ఘకాలం క్రికెట్ ఆడే సత్తా అతనికి ఉందని స్మృతి మంధాన చెప్పుకొచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications