
హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తాను క్రికెట్‌కి, జీవితానికి వ్యత్యాసం తెలుసుకోగల పరిణతి వచ్చిందంటూ పేర్కొన్నాడు. ఏడేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంపిక కానందుకు చాలా బాధపడ్డానని పేర్కొన్నాడు. దీంతో అప్పటిలో ఐపీఎల్‌లో ఆడినా ఏ మాత్రం తృప్తిని ఇచ్చేది కాదంటూ వివరించాడు.
నైట్ రైడర్స్ తరపున కెప్టెన్‌గా ఆడి రెండు టైటిళ్లు గెలుచుకున్నాడు. జాతీయ జట్టు తరపున ఆడకపోయినా గౌతం గంభీర్ గొప్ప అనుభవాన్ని సాధించానంటూ వ్యాఖ్యానించాడు. అయితే నైట్ రైడర్స్ జట్టు అతన్ని రిటెన్షన్ జాబితా నుంచి తీసివేయడంతో వేలానికి సిద్ధంగా ఉన్నాడు.
'2011లో జరిగిన సంగతి నాకు గుర్తుంది. నన్ను 50 ఓవర్ల అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌కు ఎంపిక చెయ్యలేదు. కానీ, నన్ను ఐపీఎల్ సెలక్ట్ చేసుకున్నారు. ఆ రోజు నాకు రెక్కలొచ్చినట్టు అనిపించింది. ఇప్పుడు నాకూ ఓ గుర్తింపు వచ్చింది. నేను దీంతో సంతోషంగానే ఉన్నాను.' అని అభిప్రాయపడ్డాడు.
'కోల్‌కత్తా నైట్ రైడర్స్ నేనేంటో నిరూపించుకునేందుకు మంచి వేదికను కల్పించింది. ఇప్పుడు నన్ను వేలానికి వదిలిపెట్టేయడానికి కూడా నైట్ రైడర్స్ జట్టుకు ముఖ్య కారణాలే ఉన్నాయి. జీవితం మళ్లీ ఓ కొత్త ఛాలెంజ్‌ను ఇవ్వదలిస్తే దానికి నేను సిద్ధంగానే ఉన్నాను. అనే నమ్మాకాన్ని గంభీర్ వెలిబుచ్చాడు.
'ఇంకా నేను రంజీ ట్రోఫీలో 700 పరుగులు చేశాను. నేను ఐదేళ్ల నుంచి ఫిట్‌నెస్ కోసం తీవ్రంగా కష్టపడుతున్నాను. జీవితంలో ఇలాంటివన్నీ తప్పవు. నేను ఎలాంటి క్రీడాకారులతోనైనా పోటీపడడానికి సిద్ధంగా ఉన్నాను.' అని తెలిపాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.