Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తనను భయపెట్టిన బౌలర్ గురించి వెల్లడించిన రోహిత్ శర్మ

Rohit Sharma: రోహిత్ శర్మ.. పరిచయం అక్కర్లేని పేరు. అభిమానులు అతన్ని హిట్ మ్యాన్‌గా పిలుచుకుంటారు. క్రికెట్‌లో భారత్‌కు ఉన్న ఘనమైన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తోన్న జట్టు సారథి. అంతర్జాతీయ క్రికెట్‌లో టన్నుల కొద్దీ పరుగులు చేస్తోన్న డాషింగ్ ఓపెనర్. 17 సంవత్సరాల కిందట అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. కేప్టెన్ స్థాయికి ఎదిగాడు.

ఈ 17 సంవత్సరాల క్రికెట్ ప్రయాణంపై స్పందించాడు రోహిత్ శర్మ. దుబాయ్‌ ఐ 103.8 వెబ్‌సైబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. తన కేరీర్‌కు సంబంధించిన అనేక అంశాలను స్పృశించాడు. క్రికెట్‌లో ఈ స్థాయి ఎదుగుదలకు కారణమైన విషయాల గురించి వివరించాడిందులో.

I had watched Dale Steyn s videos 100 times before I went to bat says Rohit Sharma

ప్రపంచ క్రికెట్‌లో తనను బాగా ఇబ్బందిపెట్టిన బౌలర్ గురించీ ప్రస్తావించాడు రోహిత్ శర్మ. దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్‌ను తనను భయపెట్టాడని పేర్కొన్నాడు. లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి స్టెయిన్ సంధించే బుల్లెట్ల వంటి బంతులను ఎదుర్కొనడానికి కొంత ఇబ్బంది పడేవాడినని చెప్పుకొచ్చాడు.

దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లు జరిగినప్పుడు బ్యాటింగ్‌ చేయడానికి వెళ్లే ముందు డేల్ స్టెయిన్ బౌలింగ్ యాక్షన్ గురించి ఆరా తీసే వాడినని చెప్పాడు రోహిత్ శర్మ. అతని బౌలింగ్ వీడియోలను 100 సార్లు చూసేవాడినని పేర్కొన్నాడు. అన్ని ఫార్మట్ల క్రికెట్‌లో స్టెయిన్ సాధించిన రికార్డులు స్ఫూర్తినిస్తాయని వ్యాఖ్యానించాడు.

డేల్ స్టెయిన్‌ను ఓ లెజెండ్‌గా అభివర్ణించాడు రోహిత్ శర్మ. అతని బౌలింగ్, సాధించిన రికార్డులు ఎప్పుడూ తనకు అద్భుతంగా అనిపిస్తాయని వివరించాడు. అలాగే మ్యాచ్‌లో అతని బౌలింగ్‌ను ఎదుర్కొనడాన్ని ఆస్వాదిస్తానని చెప్పాడు. తమ ఇద్దరి మధ్య గేమ్ ఓ యుద్ధంలా అనిపిస్తుంటుందని అన్నాడు.

Story first published: Wednesday, May 15, 2024, 15:59 [IST]
Other articles published on May 15, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+