Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పిచ్‌పై ముందే హెచ్చరించా: క్యూరేటర్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: వరుస విజయాలతో దూసుకుపోతున్న కోహ్లీసేనకు పూణె టెస్టు ఓటమి గట్టి షాకిచ్చిందనే చెప్పాలి. ఈ క్రమంలో పూణె టెస్టులో టీమిండియా ఓటమికి కారణం ఏంటనే దిశగా అభిమానుల ఆలోచనలు సాగుతున్నాయి. బ్యాటింగ్ వైఫల్యమా? నాణ్యత లేని పిచ్ తయారు చేయడమా?

నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పూణెలో జరిగిన తొలి టెస్టు రెండు రోజుల్లోనే 24 వికెట్లు పడ్డాయి. పూణె పిచ్ పూర్తిగా స్పిన్నర్లకు అనుకూలించింది. ఈ టెస్టులో టీమిండియా స్పిన్నర్లు అశ్విన్, జడేజా ఇద్దరూ కలసి మొత్తం 12 వికెట్లు తీయగా, ఆసీస్ స్పిన్నర్ ఓకీఫ్ ఒక్కడే 12 వికెట్లు తీసి ఆసీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ఐదు రోజులు జరగాల్సిన మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసిపోవడం, భారత్‌పై ఆసీస్ 333 పరుగుల తేడాతో విజయం సాధించడం కూడా క్రికెట్ విశ్లేషకులను ఎంతగానో వేధిస్తోంది. ఈ క్రమంలో పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం పిచ్‌పై విమర్శలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే వికెట్‌ను రూపొందించిన క్యూరేటర్‌ పాండురంగ్ సాల్గోన్‌పై తీవ్ర విమర్శలు వస్తుండటంతో అతడు సోమవారం మీడియాతో మాట్లాడాడు. బీసీసీఐ పిచ్ కమిటీ పెద్దలు వ్యవహరించిన తీరు కారణంగానే పూణె మ్యాచ్ మూడు రోజుల్లో ముగిసిందని పేర్కొన్నాడు. బీసీసీఐ పిచ్ కమిటీపై సంచలన ఆరోపణలు కూడా చేశాడు.

బీసీసీఐని ముందుగానే హెచ్చరించా

బీసీసీఐని ముందుగానే హెచ్చరించా

'ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నా. పిచ్ తయారీకి సంబంధించి నాకు నిర్దేశించిన కొన్ని ఆదేశాలు ఆధారంగా బీసీసీఐని ముందుగానే హెచ్చరించా. ఎటువంటి పచ్చదనం లేకుండా పూర్తిగా పొడి పిచ్‌ను రూపొందించడం మంచికాదనే చెప్పా. అసలు నీటితో పిచ్ ను తడపకుండా గడ్డిని తీసేయమన్నారు' అని అన్నాడు.

పిచ్ పూర్తిగా పొడిగా మారిపోయి స్పిన్‌కు అనుకూలించింది

పిచ్ పూర్తిగా పొడిగా మారిపోయి స్పిన్‌కు అనుకూలించింది

'అయితే ఇది ప్రమాదమని ముందుగానే బీసీసీఐ పిచ్ కమిటీ పెద్దలకు తెలిపా. వారు నా మాట వినలేదు. దాంతో పిచ్ పూర్తిగా పొడిగా మారిపోయి స్పిన్‌కు అనుకూలించింది. ఆ బీసీసీఐ పెద్దల పేర్లను ఇక్కడ చెప్పాలనుకోవడం లేదు. వారి ఆదేశాల్ని నేను పక్కకు పెట్టలేను కదా. సాధ్యమైనంత వరకూ పిచ్‌ను బాగా రూపొందించాలనే యత్నించా' అని తెలిపాడు.

పిచ్ క‌మిటీ ఏం చెబితే అదే చేయాలి

పిచ్ క‌మిటీ ఏం చెబితే అదే చేయాలి

'అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు జ‌రిగే స‌మ‌యంలో తాము కేవ‌లం స‌హాయ‌కులుగా మాత్రమే ప‌నికొస్తామ‌ని, పిచ్ క‌మిటీ ఏం చెబితే అదే చేయాల్సి ఉంటుంది' అని పాండురంగ్ సాల్గోన్‌ అన్నాడు. ఈ క్రమంలో పిచ్‌లో నాణ్యత లేకుండా పోయిందని చెప్పుకొచ్చాడు. తన జాబ్ బీసీసీఐ ఆదేశాల్ని పాటించడమేనని అన్నాడు.

పూర్తి స్పిన్ పిచ్ త‌యారుచేయాల‌ని ఆదేశాలు

పూర్తి స్పిన్ పిచ్ త‌యారుచేయాల‌ని ఆదేశాలు

పిచ్ క‌మిటీ స‌భ్యుల పేర్లు చెప్ప‌క‌పోయినా.. క‌మిటీ చీఫ్ ద‌ల్జీత్‌సింగ్‌, వెస్ట్‌జోన్ హెడ్ ధీర‌జ్ ప‌ర్సానా మ్యాచ్‌కు ముందు పిచ్‌ను ప‌రిశీలించిన‌ట్లు తెలిసింది. ఇదిలా ఉంటే పూణెలో పూర్తి స్పిన్ పిచ్ త‌యారుచేయాల‌ని టీమిండియా మేనేజ్‌మెంట్ నుంచే ఆదేశాలు వ‌చ్చాయ‌న్న పుకార్లు కూడా ఉన్నాయి.

పూణె ఫలితం అసంతృప్తి క‌లిగించింది

పూణె ఫలితం అసంతృప్తి క‌లిగించింది

అయితే ఆ విష‌యం త‌న‌కు తెలియ‌ద‌ని పాండురంగ్ సాల్గోన్‌ చెప్పాడు. జట్టు నుంచి ఎవ‌రూ త‌న‌ను క‌ల‌వ‌లేద‌ని, సీనియ‌ర్ క్యూరేట‌ర్ల‌ను క‌లిసి చెప్పి ఉండొచ్చ‌ని తెలిపాడు. పూణెలో జ‌రిగిన తొలి టెస్టులోనే ఇలాంటి ఫ‌లితం రావ‌డం త‌న‌కు అసంతృప్తి క‌లిగించింద‌ని పాండురంగ్ సాల్గోన్‌ అన్నాడు. ఇదిలా ఉంటే మ్యాచ్‌కు ముందే ఈ పిచ్‌ను చూసిన షేన్ వార్న్‌, గ‌వాస్క‌ర్‌, సంజ‌య్ మంజ్రేక‌ర్ ఆశ్చ‌ర్య‌పోయారు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+