అఫ్రిదీతో సెక్స్‌లో పాల్గొన్నా: మోడల్ సంచలనం
న్యూఢిల్లీ: పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీకి సంబంధించి మోడల్, నటి అర్షి ఖాన్ సంచలన విషయాన్ని వెల్లడించింది. అఫ్రిదీతో తాను సెక్స్‌లో పాల్గొన్నట్లు చెప్పింది. ట్విట్టర్‌లో ఆమె మంగళవారంనాడు ఆ రహస్యాన్ని బయటపెట్టింది. అది తనకు ప్రేమాస్పదమైందని తెలిపింది.
"అవును, అతనితో సెక్స్‌లో పాల్గొన్నా. ఎవరితోనైనా పడుకోవాలంటే భారత మీడియా పర్మిషన్ తీసుకోవాలా, ఇది నా వ్యక్తిగత జీవితం. అది నాకు ఇష్టమైంది" అని ఆమె ట్వీట్ చేసింది. షాహిద్ అఫ్రిదీతో సంబంధం ఉన్నట్లు వచ్చిన పుకార్లను ఆమె ఇంతకు ముందు ఖండించింది.

తాము మంచి మిత్రులమని, తాము కొన్నిసార్లు కలిశామని, అంతకు మించి ఏమీ లేదని ఆమె చెప్పింది. భోపాల్‌కు చెందిన మోడల్ అర్షి ఖాన్ షాహిదీ అఫ్రిదీతో గడిపినట్లు వార్తలు కూడా వచ్చాయి.
రాధే మా సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు, ఆధ్యాత్మిక దేవతగా చెప్పుకునే రాధే మా ఏజెంట్ తనను కలిసి ఆ రాకెట్‌లో చేరాలని అడిగినట్లు ఇంతకు ముందు చెప్పింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications