Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కెరీర్‌లో ఆఖరి వన్డే ఆడబోతున్న 'దవాల్' ద్రవిడ్..!!

Indian Team
భారత జాతీయ జట్టు కీలక ఆటగాడు రాహుల్ ద్రవిడ్‌కు వనే్డ ఇంటర్నేషనల్ కెరీర్ నుంచి ఏ రకంగా వీడ్కోలు పలుకుతారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. శుక్రవారం కార్డ్ఫి వేదికగా టీమిండియా-ఇంగ్లాండ్ జట్లు చివరిదైన ఐదో వనే్డలో ఢీ కొంటాయి. ద్రవిడ్‌కు ఇదే చివరి వనే్డ ఇంటర్నేషనల్ కావడం విశేషం. ఈ సిరీస్ తర్వాత టి-20, వన్డేఫార్మెట్స్ నుంచి రిటైరవుతున్నట్టు ద్రవిడ్ ఇంతకు ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. దీనితో టీమిండియా సభ్యులు ఓ అద్భుత విజయంతో అతనికి వీడ్కోలు పలుకుతుంరా? లేక పేలవమైన ఆటతో అతనిని నిరాశపరుస్తారా? అన్నది వేచిచూడాలి. అంతేగాక, తోటి ఆటగాళ్లు, ప్రత్యేకించి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అతనిని ఎలా గౌరవిస్తాడన్న ప్రశ్న అందరినీ వేధిస్తున్నది.

సుదీర్ఘ ఇంగ్లండ్‌ పర్యటనలో ఒక్క మ్యాచ్‌ను కూడా గెలవని టీమిండియా కనీసం శుక్రవారం జరిగే చివరి వన్డేలోనైనా గెలిచి కాస్తయిన పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో అతనికి విజయంతో వీడ్కోలు పలకాలని భారత ఆటగాళ్లు తహతహలాడుతున్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో వర్షం వల్ల టైతో సంతృప్తి పడిన ధోనీ సేన చివరి మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో భారత ఆట గణనీయంగా మెరుగుపడింది. ఒంటిచేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని తారుమారు చేసే రైనా, ధోనీ ఫాంలోకి రావడం జట్టుకు కలిసి వచ్చే విషయం. అంతేగాక, అజ్యంకా రహానె, పార్థివ్‌ పటేల్‌ అద్భుత ఫాంలో ఉన్నారు. మరోవైపు ఈ మ్యాచ్‌ తర్వాత వన్డే క్రికెట్‌ నుంచి తప్పుకోనున్న సీనియర్‌ ద్రవిడ్‌ కూడా చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడాలనే పట్టుదలతో ఉన్నాడు. గతంలో పలు మ్యాచుల్లో భారత్‌కు ఒంటిచేత్తో విజయాలు సాధించి పెట్టిన ద్రవిడ్‌ ఈ సిరీస్‌లో మాత్రం అంతగా రాణించలేక పోయాడు.

టెస్టుల్లో వరుస సెంచరీలతో అదరగొట్టిన ది వాల్‌ వన్డేల్లో మాత్రం ప్రభావం చూపలేక పోయాడు. అయితే చివరి వన్డేలో ఆ లోటు పూడ్చుకోవాలని భావిస్తున్నాడు. సహచరులు కూడా మెరుగైన ఆటతో జట్టుకు అండగా నిలవాలనే పట్టుదలతో పోరుకు సిద్ధమయ్యారు. సుదీర్ఘ కాలంపాటు సాగిన ఇంగ్లండ్‌ సిరీస్‌కు ఎన్నో చేదు అనుభవాలు మిగిలాయి. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను టీమిండియా 0-4 తేడాతో ఓడి పోయింది. అంతేగాక, ఏకైక టి-20 మ్యాచ్‌లోనూ భారత్‌కు ఓటమి తప్పలేదు. చివరికి వన్డే సిరీస్‌లోనూ భారత్‌కు ఓటమి తప్పలేదు. నాలుగో మ్యాచ్‌ టై కావడంతో ధోనీ సేన మరో మ్యాచ్‌ మిగిలివుండగానే 0-2 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది.

ఇద ద్రవిడ్ కెరియర్‌లో 343 వన్డేల్లో 39 సగటుతో 10,820 పరుగులు చేశాడు. ఇందుల్లో 12 సెంచరీలు, 82 అర్ధ సెంచరీలు చేయడం జరిగింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+