పాకిస్దానీ బుకీ మజీద్ నోటివెంట ఇండియా టాప్ ప్లేయర్స్ పేర్లు

ఇప్పుడు మీకు ఇంకో కొత్త కధ చెబుతాను. ఈ ఏజెంట్ మజార్ మసీద్‌ని కలిసిన అండర్ కవర్ రిపోర్టర్స్‌కి కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఈ కొత్త విషయాలలోకి మన ఇండియన్ టీమ్ ప్లేయర్స్‌కి సంబంధించిన సమాచారం బయటకు వస్తుంది. మజార్ మసీద్ చెప్పిన సమాచారం ప్రకారం ఇండియన్ ప్లేయర్స్‌లలో హార్బజన్ సింగ్, యువరాజ్ సింగ్‌లు కూడా మజార్ మసీద్‌కు అందుబాటులో ఉంటారని వెల్లడించడం జరిగింది.
ఇక వెస్ట్ ఇండిస్‌కు చెందిన క్రిస్ గేల్, ఆస్ట్రేలియా మాజీ సారధి రికీ పాంటింగ్, బ్రెట్ లీ వీళ్ళంతా తనకు టచ్‌లో ఉంటారని మాత్రం వెల్లడించాడు. ఐతే పైన పేర్కోన్న క్రికెట్ ఆటగాళ్లు మజార్ మసీద్‌కి ఏవిధంగా పరిచయం ఉన్నారో మాత్రం తెలియజేయలేదని సమాచారం. ప్రస్తుతం ముగ్గురు పాక్ క్రికెటర్లుపై విచారణను సౌత్‌వార్క్ క్రౌన్ కోర్టు పరిధిలో విచారణ జరుగుతుంది. నాల్గవ రోజు విచారణ సందర్బంగా మజార్ మజీద్ మాట్లాడిన మాటలను రికార్డ్ చేయడం జరిగింది. తన సంభాషణలో మజార్ మజీద్ పైన పేర్కోన్న క్రికెట్ పేర్లు వెల్లడించాడు.
ఈ విచారణలో మజార్ మసీద్ మాజీ ఐపిఎల్ కమీషనర్ లలిత్ మోడి తనకు మంచి స్నేహితుడిగా అభివర్ణించాడు. వీరితో పాటు తనకు అత్యంత సన్నిహితులుగా మైక్ గాటింగ్, ఫిల్ టఫెనల్, బాయ్ కాట్, ఇమ్రాన్ ఖాన్ పేర్లని కూడా ప్రస్తావించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక అంతక ముందు రోజు మజార్ మసీద్ పాకిస్దాన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్, అతని తమ్ముడు బ్యాట్స్ మెన్ ఉమర్ అక్మల్‌తో పాటు మరో ఫాస్ట్ బౌలర్ వాహాబ్ రియాజ్‌లు కూడా ఉన్నట్లు తెలిపాడు.
2010 ఆగస్టులో ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో సల్మాన్ భట్ ఆడినటువంటి మెయిడిన్ ఓవర్‌పై కూడా విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలను ప్రజలకు తెలయజేసేందుకు న్యూస్ ఆఫ్ ద వరల్డ్ అనే న్యూస్ పేపర్ జర్నలిస్ట్‌లు తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు. ఈ జర్నలిస్ట్ చెప్పిన దాని ప్రకారం యుఎఈలో ఓ ఇండియన్ బిజినెస్ మ్యాన్ ఏజెంట్ మజర్ మాజిద్ కలసి ఈ టోర్నమెంట్‌పై చర్చించినట్లు తెలిపారు. వీరిద్దరి చివరి సంభాషణలో ఫిక్సింగ్ గురించి మాట్లాడుకున్నట్లు తెలిసింది.
అంతేకాకుండా కనీసం పాకిస్దాన్‌కి చెందిన ముగ్గురు ప్లేయర్లు ఈ ఫిక్సింగ్‌లో పాల్గోనాల్సిందిగా ఏజెంట్ మజర్ మాజిద్‌కి సూచన ఇచ్చినట్లు తెలిపాడు. దీనికి బదులుగా ఏజెంట్ మజర్ మాజిద్ బాస్ ఇప్పటికే నేను ఈ ఫిక్సింగ్‌లో ఆరుగురుని పాల్గోనాల్సిందిగా కొరడం జరిగిందని చెప్పాడు. ఓ ప్రముఖ వెబ్ సైట్లో అందించిన సమాచారం ప్రకారం ఏజెంట్ మజర్ మాజిద్ బ్యాట్స్ మెన్ ఇమ్రాన్ ఫర్హాత్ పేరుని కూడా సూచించడం జరిగింది. ఆ తర్వాత మరలా ఇమ్రాన్ ఫర్హాత్ పూర్తి ఫిక్సింగ్‌లో లేడని కూడా వెల్లడించడం జరిగింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications