హైదరాబాద్: భారత ఓపెనర్ శిఖర్ ధావన్ ఆట కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నానని శ్రీలంక దిగ్గజ ఆటగాడు సనత్ జయసూర్య అన్నాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో కోహ్లీసేన గురువారం (ఆగస్టు 3) నుంచి కొలంబో వేదికగా ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా జయూర్య ఓపెనర్ శిఖర్ ధావన్‌పై ప్రశంసలు కురిపించాడు. ధావన్ ఎటాక్‌ను చూస్తుంటే తాను క్రికెట్ ఆడిన రోజులు గుర్తుస్తున్నాయని చెప్పాడు. గతంలో తన ఎటాక్‌కు, ప్రస్తుత ధావన్ ఎటాక్‌కు చాలా పోలికలున్నాయని జయసూర్య చెప్పాడు.

గాలే వేదికగా జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ధావన్ ఆటను తాను ఎంతగానో ఎంజాయ్ చేసినట్లు పేర్కొన్నాడు.