For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ టీం మంచి ఫ్రెండ్స్, వారితో పోటీ ఇబ్బందే: ఆస్ట్రేలియా మాక్స్‌వెల్

By Srinivas

సిడ్నీ: భారత ఆటగాళ్లతో కలిసి ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన తర్వాత.. ఇప్పుడు వారికి వ్యతిరేకంగా ఆడటం కొంత కష్టమేనని ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్ ఆదివారం అన్నాడు. మార్చి 26వ తేదీన ఆస్ట్రేలియా - భారత్‌లు సెమీ ఫైనల్లో తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం మాక్స్‌వెల్ మాట్లాడాడు.

వ్యక్తిగతంగా భారత ఆటగాళ్లతో తనకు మంచి సంబంధం ఉందని చెప్పాడు. 26 ఏళ్ల మాక్స్‌వెల్ గత మూడేళ్లుగా ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో తనకు భారత జట్టు ఆటగాళ్లతో మంచి స్నేహం ఏర్పడిందని చెప్పాడు.

I get along with Indian cricketers really well, says Glenn Maxwell

ఐపీఎల్లో వివిధ జట్లతో ఆడటం వల్ల మరింత ఎక్కువ మంది స్నేహితులు, వారి గురించి మరింత ఎక్కువ తెలుసుకునేందుకు ఉపయోగపడిందని చెప్పాడు. మ్యాచ్‌ల అనంతరం వారితో కలిసి గడపడం, కలిసి భోజనం చేయడం.. ఇలాంటివన్నీ మంచి స్నేహానికి దారి తీశాయని చెప్పాడు. వారితో తాను ఎప్పుడు టచ్‌లో ఉంటానని చెప్పాడు.

అలాంటి భారత ఆటగాళ్లతో.. వారికి వ్యతిరేకంగా ఇప్పుడు ఆడటం కొంత ఇబ్బందేనని చెప్పాడు. అందులో కొందరు తనతో కలిసి ఐపీఎల్లో ఆడిన వారు ఉన్నారని, ఇప్పుడు వారితో పోటీ పడవలసి వస్తోందని అన్నాడు. మాక్స్‌వెల్ హర్భజన్ సింగ్ పైన ప్రశంసలు కురిపించాడు. అతను బ్రిలియంట్ అని, ఫన్నీయెస్ట్ గాయ్ అని కితాబిచ్చాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+