'రహానే ఎంతో కష్టపడ్డాడు.. రోహిత్‌ను చూస్తే బాధేస్తోంది'

ముంబై: తొలి టెస్టులో వైస్ కెప్టెన్ అజింక్య రహానే ఎంతో కష్టపడ్డాడు. జట్టు కష్టాల్లో ఉన్నపుడు రహానే తన భుజాలపై భారం వేసుకొని పరిస్థితులను నియంత్రించాడు. అయితే తొలి టెస్టులో చోటు దక్కని టీమిండియా 'హిట్‌మ్యాన్' ఓపెనర్ రోహిత్ శర్మను చూస్తే బాధేస్తోందని మాజీ క్రికెటర్ ప్రవీణ్ ఆమ్రె తెలిపారు. తొలి టెస్టుకు ముందు రహానే, రోహిత్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. అయితే జట్టు కూర్పును దృష్టిలో ఉంచుకుని కెప్టెన్ విరాట్ కోహ్లీ రహానేకు ఓటు వేసాడు.

రోహిత్ అద్భుతాలు చేయగలడు:
తాజాగా రహానే వ్యక్తిగత కోచ్ ప్రవీణ్ ఆమ్రె మాట్లాడుతూ... 'రోహిత్ శర్మ విషయంలో చింతిస్తున్నాను. ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు సాధించిన రోహిత్‌కు అవకాశం ఇవ్వాల్సి ఉండేదని వ్యక్తిగతంగా భావిస్తున్నాను. రోహిత్ అద్భుతాలు చేయగల ఆటగాడు' అని ఆమ్రె అన్నారు. 'జట్టు యాజమాన్యం రహానేకు మద్దతు ఇచ్చింది. ఆ నమ్మకాన్ని రహానే నిలబెట్టుకున్నాడు. అందుకు ఆనందంగా ఉంది. అంతా దేవుడి దయ' అని ఆమ్రె పేర్కొన్నారు.

ఎంతో కష్టపడ్డాడు:
'గత రెండేళ్ళు రహానే ఎంతో కష్టపడ్డాడు. అతను ఎప్పుడూ నిరాశపడలేదు. ఇంగ్లాండ్ వెళ్లి డ్యూక్ బంతితో కౌంటీల్లో ఆడాడు. ఒక వారం బెంగళూరులోని ఎన్‌సీఏలో సమయం గడిపాడు. తనని తాను తీర్చిదిద్దుకున్నాడు. అతడి చేతుల్లో ఉన్నదంతా చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో రహానే చేసిన 81 పరుగులు ఎంతో కీలకం. ఆ ఇన్నింగ్స్ అతనికి ప్రేరణనిచ్చింది. సెంచరీ చేయనప్పటికీ అతడు ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలో విలువైన ఇన్నింగ్స్‌లు ఆడాడు' అని ఆమ్రె తెలిపారు.

ఒత్తిడిని తట్టుకొని ఆడగలిగేది రహానేనే:
'భారత జట్టు ఇప్పుడు టెస్టులలో మొదటి స్థానంలో ఉంది. అందులో రహానే భాగస్వామ్యం ఎంతో ఉంది. తొలి టెస్టులో జట్టు 25/3తో ఉన్నప్పుడు తన భుజాలపై భారం వేసుకొని పరిస్థితులను నియంత్రించాడు. పుజారా, కోహ్లీ త్వరగా ఔటైన సమయంలో ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. అయినా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఒత్తిడిని తట్టుకొని ఆడగలిగేది రహానే మాత్రమే. అతడి టెక్నిక్‌కు తిరుగులేదు. అతడి విజయంలో నా పాత్రేమీ లేదు' అని ఆమ్రె చెప్పుకొచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications