స్వింగ్‌లో నేను కింగ్: ట్రెంట్ బౌల్ట్


హైదరాబాద్: బంతి ఇరువైపులా స్వింగ్ అవుతున్నప్పుడు తన బౌలింగ్ చాలా భిన్నంగా ఉంటుందని న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ అన్నాడు. హామిల్టన్ వేదికగా గురువారం న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో 10 ఓవర్లు వేసిన బౌల్ట్ 21 పరుగులిచ్చి 5 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియాను 92 పరుగులకే కట్టడి చేయడంలో ట్రెంట్ బౌల్ట్ కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం ట్రెంట్ బౌల్ట్ మాట్లాడుతూ తన ప్రదర్శన పూర్తిగా పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని చెప్పాడు.

పరిస్థితులు అనుకూలంగా ఉండటం వల్లే
"పరిస్థితులు అనుకూలంగా ఉండటం వల్లే ఇలా జరిగింది. గాల్లో బంతి అలా కదలడం చాలా బాగుంది. బంతి స్వింగ్ అవుతున్నప్పుడు నేనో భిన్నమైన బౌలర్‌గా కనిపిస్తాను. గాలిలో బంతి రెండు వైపులా స్వింగ్ అయ్యింది. బంతి స్వింగ్ అవుతున్నప్పుడు నేనో భిన్నమైన బౌలర్‌గా మారిపోతా" అని బౌల్ట్ అన్నాడు.

సిరీస్ కోల్పోవడం బాధ కలిగించింది
"ఈ రోజు అదే జరిగింది. తగినంత నైపుణ్యం, లెక్కలేనన్ని వ్యూహాలు ఉన్నా.. సిరీస్ కోల్పోవడం మాకు బాధ కలిగించింది. అనుకూలంగా ఉన్న రోజు మేం రెచ్చిపోగలం. ఓపెనింగ్ బౌలర్‌గా బౌలింగ్ దళాన్ని ముందుకు నడిపించడం, బ్యాట్స్‌మెన్‌ను తప్పుదారి పట్టించడం నా బాధ్యత" అని ట్రెంట్ బౌల్డ్ తెలిపాడు.

టాప్ ఆర్డర్‌పై ఒత్తిడి పెంచాలన్నది మా ప్రణాళిక
"నాలుగో వన్డేలో అలాగే అనిపించింది. తిరిగి పుంజుకున్నందుకు సంతోషంగా ఉంది. భారత్‌లో కోహ్లీ లేడు. టాప్ ఆర్డర్‌పై ఒత్తిడి పెంచాలన్నది మా ప్రణాళిక. అమలు చేశాం. విజయం సాధించాం" అని బౌల్ట్ అన్నాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 30.5 ఓవర్లలో కేవలం 92 పరుగులకే కుప్పకూలిపోయింది.

బౌల్ట్‌కి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు
భారత్ నిర్దేశించిన 93 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ కేవలం 14.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో భారత జట్టుపై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఎట్టకేలకి పర్యటనలో భారత్‌కు తొలి ఓటమి రుచి చూపిన న్యూజిలాండ్ సిరీస్‌లో ఆధిక్యాన్ని కూడా 1-3కి తగ్గించింది. మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన బౌల్ట్‌కి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications