Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరాట్ కోహ్లీని చూస్తే బాధేస్తోంది.. స్పందించిన జర్మన్ మోడల్!

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇన్ స్టాగ్రామ్ అల్గారిథమ్ చుట్టూ జరుగుతున్న చర్చ ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. ఇటీవల జర్మన్ మోడన్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ లిజ్‌లాజ్ పోస్ట్ చేసిన ఓ ఫోటోను కోహ్లీ లైక్ చేసి, ఆపై వెంటనే అన్‌లైక్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్న నేపథ్యంలో సదరు మోడల్ స్వయంగా స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

అసలేం జరిగిందంటే?
తాజాగా మీడియాతో మాట్లాడిన లిజ్‌లాజ్.. ఈ మొత్తం వ్యవహారంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లిజ్‌లాజ్ మాట్లాడుతూ.. "నిజం చెప్పాలంటే నాకు విరాట్ కోహ్లీని చూస్తే కొంచెం బాధగా అనిపిస్తోంది. ఇంత చిన్న విషయాన్ని జనం ఎలా గమనిస్తారో.. దానిని ఇంతపెద్ద వార్తగా ఎలా మారుస్తారో నాకర్థం కావడం లేదు. బహుశా కోహ్లీ అనుకోకుండా లైక్ చేసి ఉండవచ్చు. కానీ ఓ గొప్ప క్రీడాకారుడు నా పోస్ట్‌ను ఇష్టపడినందుకు నేను ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను" అని లిజ్‌లాజ్ అన్నారు. తనకు ఈ విషయం ఎలా తెలిసిందో ఆమె వెల్లడిస్తూ.. నిద్ర లేవగానే తన ఇన్‌బాక్స్ వార్తా లింకులు, మెసేజ్‌లతో నిండిపోయిందని ఆమె వివరించింది.

I Feel Bad for Virat Kohli German Model Lizlaj Breaks Silence on Viral Instagram Like Row Details

విరాట్ కోహ్లీకి వీరాభిమానిని..
తాను కూడా విరాట్ కోహ్లీకి వీరాభిమానిని అంటూ లిజ్‌లాజ్ ఈ సందర్భంగా వెల్లడించారు. "నేను దక్షిణాఫ్రికాలో జన్మించాను, జర్మనీలో పెరిగాను. అక్కడ అంతా ఫుట్‌బాల్ హడావుడే ఉంటుంది. కానీ 2025లో నేను భారత్‌ పర్యటనకు వచ్చినప్పుడు, బెంగళూరులోని నా స్నేహితులు నాకు ఐపీఎల్, క్రికెట్ గురించి పరిచయం చేశారు. ఆర్సీబీకి సపోర్ట్ చేస్తూ విరాట్ కోహ్లీ ఆటను చూడటం ఒక అద్భుతమైన అనుభవం. ఆయన ఓ అసాధారణమైన ఆటగాడు" అని లిజ్‌లాజ్ ప్రశంసించారు.

మళ్లీ గుర్తొచ్చిన 'అల్గారిథమ్' ముచ్చట!
గతంలో కూడా నటి అవనీత్ కౌర్ ఫోటోను కోహ్లీ లైక్ చేసినప్పుడు సోషల్ మీడియాలో ఇలాగే చర్చ జరిగింది. అప్పట్లో కోహ్లీ స్పందిస్తూ.. తన ఫీడ్‌ను క్లియర్ చేస్తున్నప్పుడు పొరపాటున 'లైక్' పడిందని, అది ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథమ్ వల్ల జరిగిందని వివరణ ఇచ్చారు. ఇప్పుడు లిజ్‌లాజ్ ఫోటో విషయంలో కూడా అదే రిపీట్ కావడంతో, నెటిజన్లు మళ్లీ ఆ పాత అల్గారిథమ్ ముచ్చటను గుర్తు చేస్తూ విరాట్ కోహ్లీపై సరదాగా మీమ్స్ పేల్చుతున్నారు. వివాదాల నుంచి తప్పించుకోవడానికే కోహ్లీ వెంటనే అన్‌లైక్ చేసినా.. అప్పటికే ఇంటర్నెట్ కన్ను దానిని రికార్డ్ చేసేసింది.

Story first published: Saturday, April 18, 2026, 9:23 [IST]
Other articles published on Apr 18, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+