Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బీసీసీఐ బండారం బయటపెట్టిన వృద్ధిమాన్ సాహా: అర్థం చేసుకోలేకపోయా: ఆ విషయం లీక్

I failed to understand why everything changed so fast, says Wriddhiman Saha

ముంబై: భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహా.. కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీలంకతో సిరీస్‌కు తనకు జట్టులో చోటు కల్పించకపోవడం పట్ల స్పందించారు. శ్రీలంకతో సిరీస్ ఆడబోయే జట్టులోకి ఆయనను తీసుకోలేదు సెలెక్టర్లు. వృద్ధిమాన్ సాహాతో పాటు పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ, అజింక్య రహానె, టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాటర్ చేతేశ్వర్ పుజారాలను తప్పించింది. ఈ నలుగురినీ శ్రీలంకతో జరగబోయే సిరీస్‌లో తీసుకోలేదు. ఒకేసారి నలుగురు సీనియర్ ప్లేయర్లను తప్పించడం సంచలనంగా మారింది.

స్పందించిన సాహా..

స్పందించిన సాహా..

తనను జట్టులోకి తీసుకోకపోవడం పట్ల వృద్ధిమాన్ సాహా స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డులో పరిణామాలు శరవేగంగా మారిపోతోన్నాయని, ఏం జరుగుతున్నదో అర్థం కావట్లేదని అన్నారు. వేగంగా మారుతోన్న పరిణామాలు, పరిస్థితులను తాను అర్థం చేసుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో తనకు జట్టులో చోటు దక్కదనే విషయాన్ని మేనేజ్‌మెంట్ ముఖం మీదే తేల్చి చెప్పిందని అన్నారు.

 గంగూలీ అభినందించినా..

గంగూలీ అభినందించినా..

కాన్పూర్‌లోని గ్రీన్‌పార్క్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో గాయంతో బాధపడుతూనే తాను 61 పరుగులు చేశానని గుర్తు చేశారు. ఆ సమయంలో బీసీసీఐ ఛైర్మన్ సౌరభ్ గంగూలీ తనను అభినందిస్తూ మెసేజ్ చేశారని అన్నారు. జట్టులో చోటుకు ఢోకా ఉండదనే భరోసా ఇచ్చారని అన్నారు. ఆ తరువాతే బీసీసీఐలో ఏం జరిగిందో తనకు తెలియదని, శరవేగంగా మారిన పరిణామాలను తాను అర్థం చేసుకోలేకపోయానని చెప్పారు.

రిటైర్మెంట్ కోసం..

రిటైర్మెంట్ కోసం..

రిటైర్మెంట్ గురించి ఓ నిర్ణయాన్ని తీసుకోవాలంటూ మేనేజ్‌మెంట్ తనను సూచించిందని వృద్ధిమాన్ సాహా తేల్చి చెప్పారు. కొందరు సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ కొత్త వికెట్ కీపర్ కోసం ఆలోచన చేస్తున్నారనే విషయాన్ని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తనకు తెలిపాడని, జట్టులో తనకు చోటు దక్కదనే విషయం అప్పుడే అర్థమైందని పేర్కొన్నారు. తనను జట్టులోకి తీసుకోలేకపోవడానికి ప్రధాన కారణం- వయస్సు లేదా ఆటతీరు కానే కాదని ద్రవిడ్ చెప్పారని అన్నారు.

Saha Making It Easy For Ks Bharat | Teamindia Test Squad || Oneindia Telugu
ఆ విషయం ఎలా లీక్..

ఆ విషయం ఎలా లీక్..

జట్టులో యువ ప్లేయర్లను తీసుకోవాలనే ఉద్దేశంతో తనను తప్పించినట్లు కనిపిస్తోందని సాహా అభిప్రాయపడ్డారు. రిటైర్మెంట్ గురించి ఆలోచన చేయాలని ద్రవిడ్ సైతం సూచించారని పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా పర్యటనను ముగించుకుని వచ్చిన సమయంలో తన భార్య ఆసుపత్రిలో అడ్మిట్ అయిందని, కొంతకాలం కుటుంబంతో గడపాలని తాను నిర్ణయించుకున్నానని సాహా చెప్పారు. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశమైందని వ్యాఖ్యానించారు. తాను రంజీ మ్యాచ్‌లల్లో ఆడకూడదని నిర్ణయించుకున్న విషయం మీడియాకు ఎలా లీక్ అయిందో అర్థం కావట్లేదని అన్నారు.

Story first published: Sunday, February 20, 2022, 11:17 [IST]
Other articles published on Feb 20, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+