Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: స్టార్ క్రికెటర్

భారత క్రికెట్‌లోకి వచ్చి అద్బుతమైన బౌలింగ్‌తో లెగ్ స్పిన్నర్ గా తనదైన ముద్ర వేసిన ప్రముఖ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ తన వ్యక్తిగత జీవితం గురించి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భార్య ధనశ్రీ వర్మ మోసం చేయడం వల్ల తాను తీవ్ర మనోవేదనకు గురయ్యానని.. కొన్ని సందర్భాల్లో ఆత్మహత్య చేసుకోవాలని కూడా ఆలోచించినట్లు ఆయన తెలిపారు. భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన చాహల్.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా రికార్డు సృష్టించారు.

వైవాహిక జీవితంలో చీకటి రోజులు
యుజ్వేంద్ర చాహల్.. డ్యాన్సర్, యూట్యూబర్ అయిన ధనశ్రీ వర్మను ప్రేమించి డిసెంబర్ 2020లో వివాహం చేసుకున్నారు. అయితే వారి వివాహ బంధం అకాలంగా ముగిసింది. వారిద్దరి మధ్య తలెత్తిన తీవ్ర సమస్యల కారణంగా యుజ్వేంద్ర చాహల్ గత మార్చిలో విడాకులు తీసుకున్నారు. ఈ విడాకుల ప్రక్రియ, ఆ తర్వాత ఎదురైన పరిస్థితులు తనను ఎంతగానో కలచివేశాయని యుజ్వేంద్ర చాహల్ ఒక ప్రత్యేక కార్యక్రమంలో తన అనుభవాలను పంచుకున్నారు.

I Even Thought of Suicide Cricketer Yuzvendra Chahal Opens Up on Marital Trauma

"నా జీవితాన్ని తలుచుకుంటే నేను చాలా అలసిపోయాను. నాలో ఉత్సాహం పూర్తిగా చచ్చిపోయింది. చాలా సార్లు ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాను" అని యుజ్వేంద్ర చాహల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ కష్టకాలంలో తన దైనందిన జీవితం పూర్తిగా అస్తవ్యస్తమైందని ఆయన పేర్కొన్నారు. ప్రతిరోజూ రెండు గంటలు ఏడ్చేవాడినని.. రోజుకు కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రపోగలిగానని తన బాధను వ్యక్తం చేశాడు. ఇలా దాదాపు 40-45 రోజులు గడిచాయని, ఆ సమయంలో క్రికెట్ నుంచి పూర్తిగా విరామం తీసుకోవాలని కూడా ఆలోచించినట్లు ఆయన వెల్లడించారు. నిద్రలేమి కారణంగా ఆటపై కూడా తాను సరిగా దృష్టి పెట్టలేకపోయానని అన్నాడు.

ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చినప్పుడు, తన సన్నిహిత స్నేహితులతో ఈ విషయాన్ని పంచుకున్నానని చాహల్ చెప్పాడు. వారు తనకు అండగా నిలిచారని, మానసికంగా ధైర్యం చెప్పారని తెలిపాడు. ఆ సమయంలో జీవితంపై చాలా భయమేసిందని చాహల్ చెప్పుకొచ్చాడు. విడాకుల తర్వాత ప్రజల నుండి ఎదురైన ఆరోపణలు తనను మరింత బాధించాయని చాహల్ తెలిపాడు. "నేను నా భార్యకు విడాకులు ఇచ్చినప్పుడు, చాలా మంది నేను ఆమెను మోసం చేశానని అన్నారు. అది నాపై వేసిన నిరాధార నింద. నేను ఎప్పుడూ ఎవరినీ మోసం చేయలేదు. నేను అలాంటి వ్యక్తిని కాదు. నాకంటే నమ్మకమైన వ్యక్తిని మీరు ఎక్కడా చూడలేరు" అని ఆయన గట్టిగా ఖండించారు.

విలువలతో కూడిన పెంపకం
తన వ్యక్తిత్వం గురించి వివరిస్తూ, "నా సన్నిహిత స్నేహితులకు నేను హృదయపూర్వకంగా ప్రేమను ఇస్తాను. నేను వారి నుండి దేన్నీ ఆశించను. చాలా మందికి నేను సహాయం చేస్తాను. నా గురించి సరిగ్గా తెలియని వారే ఈ విడాకుల విషయంలో నాపై నిందలు వేశారు" అని స్పష్టం చేశారు.ఇంకా, తన కుటుంబ నేపథ్యం గురించి వివరిస్తూ, "నాకు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. వారితోనే నేను చిన్నప్పటి నుండి పెరిగాను. ఆడవారిని ఎలా గౌరవించాలో నాకు బాగా తెలుసు. అలాగే నా తల్లిదండ్రులు నాకు నేర్పించారు" అని తన పెంపకం విలువలను గుర్తు చేసుకున్నారు. తన పేరును అనేక విషయాల్లో లాగుతున్నారని, తన గురించి రాస్తే ఎక్కువ మంది చదువుతారనే ఉద్దేశ్యంతో కొందరు ఇలా చేస్తున్నారని చాహల్ అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు చాహల్ వ్యక్తిగత జీవితంలో ఎంతగా కుంగిపోయారో స్పష్టం చేస్తున్నాయి.

Story first published: Friday, August 1, 2025, 9:48 [IST]
Other articles published on Aug 1, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+