Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మహేశ్.. నాని సినిమాలను ఎంజాయ్ చేస్తా: లక్మణ్

I enjoy watching movies of Mahesh Babu and Nani

హైదరాబాద్: భారత క్రికెట్‌‌తో వీవీఎస్ లక్ష్మణ్‌కు విడదీయరాని అనుబంధం ఉంది. ఏళ్ల తరబడి టీమిండియాలో కీలక ఆటగాడిగా కొనసాగిన లక్ష్మణ్.. రిటైర్మెంట్ ప్రకటించినా.. ఆటకు మాత్రం దూరం కాలేదు. కామెంటేటర్ అవతారం ఎత్తడంతోపాటు, సన్‌రైజర్స్ ఫ్రాంచైజీతో తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు. మిగతా బ్యాట్స్‌మెన్ ఆసీస్ బౌలర్లను చూసి వణికిపోతే.. లక్ష్మణ్ మాత్రం కంగారూలను కంగారెత్తించేవాడు.

కానీ అలాంటి లక్ష్మణ్‌కు వసీం అక్రమ్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం సవాల్‌గా అనిపించిదేట. ఆస్క్ ది లక్ష్మణ్ పేరిట నెటిజన్లతో ముచ్చటించిన లక్ష్మణ్ మనసులోని భావాలను బయటపెట్టాడు. ఆ వివరాలు మీకోసం.. కోహ్లికి మిగతా ఆటగాళ్లకు తేడా ఏంటని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు లక్ష్మణ్ అద్భుతంగా బదులిచ్చాడు.

మానసిక బలం, గేమ్ ప్లాన్‌ను ఆచరణలో పెట్టడం

మానసిక బలం, గేమ్ ప్లాన్‌ను ఆచరణలో పెట్టడం

మానసిక బలం, గేమ్ ప్లాన్‌ను ఆచరణలో పెట్టడం, మనసును అదుపులో ఉంచుకోవడం అంటూ లక్ష్మణ్ సమాధానం ఇచ్చాడు. హాఫ్ సెంచరీలను, సెంచరీలుగా మార్చగలగడం కూడా కోహ్లికి, మిగతా ఆటగాళ్లకు తేడా అని లక్ష్మణ్ చెప్పారు. ప్రస్తుత తరంలోని ఉత్తమ బ్యాట్స్‌మెన్ ఎవరని అడిగిన ప్రశ్నకు వీవీఎస్.. స్పెషల్‌గా బదులిచ్చాడు. టీ20ల్లో ఏబీ డివిలియర్స్, వన్డేల్లో విరాట్, టెస్టుల్లో స్టీవ్ స్మిత్ బెస్ట్ అని చెప్పిన లక్ష్మణ్.. మూడు ఫార్మాట్లు కలిపితే విరాట్ అత్యుత్తమ ఆటగాడని చెప్పాడు.

 టోర్నీలు గెలిచినప్పుడే సరైన గుర్తింపు

టోర్నీలు గెలిచినప్పుడే సరైన గుర్తింపు

ఆస్క్ లక్ష్మణ్ పేరిట నెటిజన్లతో శుక్రవారం ముచ్చటించిన లక్ష్మణ్.. తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లకు జాతీయ జట్టులో చోటు ఎందుకు దక్కడం లేదన్న ప్రశ్నకు బదులిచ్చాడు. జాతీయ స్థాయిలో ఆడగల ప్రతిభావంతులైన ఆటగాళ్లు మన దగ్గర ఉన్నారు. కానీ టోర్నీలు గెలిచినప్పుడే సరైన గుర్తింపు దక్కుతుందని వీవీఎస్ చెప్పాడు. తను శాకాహారినని చెప్పిన లక్ష్మణ్.. తనకు బిర్యానీ అంటే ఇష్టమని, ప్యారడైజ్ బిర్యానీ అంటే మరింత ఇష్టమని తెలిపాడు.

మహేష్, నాని సినిమాలను ఎంజాయ్ చేస్తా:

బాలీవుడ్‌లో తన ఫేవరెట్ యాక్టర్.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అని వీవీఎస్ చెప్పాడు. మీ ఫేవరెట్ తెలుగు యాక్టర్ ఎవరన్న ప్రశ్నకు లక్ష్మణ్ తనదైన శైలిలో బదులిచ్చారు. తెలుగులో ఎంతో మంది టాలెంటెడ్ యాక్టర్లు ఉన్నారన్న వీవీఎస్.. మహేష్ బాబు, నాని సినిమాలను చూడటాన్ని ఎంజాయ్ చేస్తానని చెప్పాడు. వీవీఎస్ రిప్లయ్‌తో మహేష్, నాని ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతున్నారు.

జడేజా బ్యాటింగ్ కూడా చేయగలడని

జడేజా బ్యాటింగ్ కూడా చేయగలడని

భారత జట్టు 3-2 తేడాతో ఇంగ్లాండ్‌పై టెస్టు సిరీస్ నెగ్గుతుందనే ధీమాను లక్ష్మణ్ వ్యక్తం చేశాడు. తానైతే లార్డ్స్ టెస్టులో జడేజా రూపంలో అదనపు స్పిన్నర్‌ను తీసుకుంటానని, అతడు బ్యాటింగ్ కూడా చేయగలడని వీవీఎస్ చెప్పాడు.

Story first published: Friday, August 10, 2018, 14:25 [IST]
Other articles published on Aug 10, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+