నెరవేరుతుందా?: 'భారత్‌లో టెస్టు సిరిస్ గెలవడం నా కల'
హైదరాబాద్: భారత్‌లో కనీసం ఒక టెస్టు సిరిస్‌నైనా గెలవడం తన కల అని శ్రీలంక వెటరన్ స్పిన్నర్ రంగనా హెరాత్ పేర్కొన్నాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-0తో శ్రీలంక కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ జట్టులో రంగనా హెరాత్ సభ్యుడిగా ఉన్నాడు. త్వరలో శ్రీలంక జట్టు మూడు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడేందుకు భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటన కోసం శ్రీలంక జట్టు బుధవారం భారత్‌కు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో రంగనా హెరాత్ మీడియాతో మాట్లాడాడు.

భారత్‌లో టెస్టు సిరీస్ గెలవడమనేది నా కల
'భారత్‌లో టెస్టు సిరీస్ గెలవడమనేది నా కల. ఒకవేళ భారత్‌లో టెస్టు మ్యాచ్ గెలిస్తే నిజంగా అద్భుతమే అవుతుంది. ఇప్పటివరకూ అక్కడ టెస్టు మ్యాచ్ గెలవకపోవడంతో దాన్ని సాకారం చేసుకోవాలని అనుకుంటున్నా. అదే సమయంలో సిరీస్‌ను కూడా సొంతం చేసుకోవాలనేదే నా లక్ష్యం' అని హెరాత్ అన్నాడు.

పాకిస్తాన్‌పై టెస్టు సిరీస్ గెలవడం ఆత్మవిశ్వాసాన్ని నింపింది
యూఏఈ వేదికగా పాకిస్తాన్‌పై టెస్టు సిరీస్ గెలవడం తమలో ఆత్మవిశ్వాసాన్ని తీసుకొచ్చిందని అన్నాడు. అదే విజయపరంపరను భారత్‌లో కూడా కొనసాగించేందుకు సిద్దంగా తాను ఉన్నట్లు హెరాత్ ఈ సందర్భంగా తెలిపాడు. ఇప్పటివరకు భారత్‌లో శ్రీలంక ఒక్క టెస్టు మ్యాచ్‌ను కూడా గెలవలేదు.

3-0తో టెస్టు సిరిస్‌ను కైవసం చేసుకున్న కోహ్లీసేన
అంతేకాదు ఆస్ట్రేలియాలో ఆసీస్‌పై కూడా శ్రీలంక ఒక్క టెస్టు మ్యాచ్ కూడా గెలవక పోవడం విశేషం. ఇటీవలే శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత్ జట్టు 3-0తో టెస్టు సిరిస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెరాత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

భారత పర్యటనకు లంక జట్టు
దినేస్ చండీమాల్ (కెప్టెన్), కరుణరత్నె, ధనంజయ, సమరవిక్రమ, మాథ్యూస్, తిరిమన్నె, హెరాత్, లక్మల్, పెరీరా, గమగె, సందకన్, ఫెర్నాండో, షనక, డిక్‌వెలా, రోషన్ సిల్వా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications