సునీల్ నరైన్ కేకేఆర్ జట్టుకు వచ్చి పదేళ్లయినా.. పదును మాత్రం తగ్గేదే లే!

మిస్టరీ స్పిన్నర్, హార్డ్ హిట్టర్ సునీల్ నరైన్ అంటే తెలియని ఐపీఎల్ అభిమాని ఉండడు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు సొంత ఆస్తిలా సునీల్ నరైన్ మారిపోయాడంటే అతిశయోక్తి కాదు. 2012 నుంచి వరుసగా 11సీజన్ల పాటు కేకేఆర్‌కు ఆడుతున్న ఈ స్పిన్ మాంత్రికుడు.. ఎన్నో సార్లు మ్యాచ్ విన్నర్‌గా జట్టును గెలిపించాడు. ఈ సీజన్‌లోనూ తన సత్తా చాటుతున్న సునీల్ నరైన్ కేకేఆర్ ఫ్రాంచేజీకి అమూల్యమైన సేవలందిస్తున్నాడు. ఈ క్రమంలో ఒకే ఫ్రాంఛైజీకి 10ఏళ్ల పాటు ఆడిన క్రికెటర్‌గా నరైన్ రికార్డ్ నెలకొల్పాడు. 2012నుంచి ప్రస్తుత 2022సీజన్ వరకు కేకేఆర్ సుస్థిర బౌలర్‌గా సునీల్ నరైన్ ప్రస్థానం కొనసాగింది. 2012లో, 2014లో కోల్‌కతా ఐపీఎల్ ట్రోఫీలు గెలవడంలో నరైన కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్లలో 24, 21 వికెట్లతో చెలరేగాడు.

కెరీర్ చివరి వరకు కోల్‌కతాకే ఆడాలనుకుంటున్నా
33ఏళ్ల ఈ వెస్టిండీస్ స్పిన్నర్.. కోల్‌కతా ఫ్రాంఛైజీతో తన 10ఏళ్ల ప్రయాణం సందర్భంగా ఓ వీడియోలో మాట్లాడుతూ.. తన ఐపీఎల్ కెరీర్ ముగిసే వరకు కోల్‌కతా జట్టుకే ఆడాలనుకుంటున్నా అని పేర్కొన్నాడు. కోల్‌కతాకు ఆడడం తనకు చాలా ఇష్టంగా ఉంటుందన్నాడు. అందుకే ఈ జట్టుతోనే తన కెరీర్‌కు ముగింపు పలకాలనుకుంటున్నా అని చెప్పాడు. దశాబ్ద కాలంగా ఆడుతుండడం చాలా గొప్పగా అనిపిస్తుందన్నాడు. ఎందుకంటే ఐపీఎల్లో చాలా మంది విదేశీ ప్లేయర్లు ఒకే జట్టుకు సుదీర్ఘకాలంగా ఆడడం చాలా అరుదు. లక్కీగా ఆ అరుదైన వ్యక్తుల్లో తాను ఒకరిగా ఉన్నందుకు సంతోషిస్తున్నా అన్నాడు. అలాగే కెరీర్ అనంతరం భవిష్యత్తులోనూ కోల్‌కతా జట్టుతో తన అనుబంధం కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు.

సంపాదనలోనూ సెంచరీ కొట్టాడు..
ఐపీఎల్‌లో బ్యాట్‌తో, బంతితో చెలరేగె సునీల్ నరైన్ తన వేతనం ద్వారా తాజాగా ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండడం ఇది 11వసారి. ఈక్రమంలో 10సీజన్లకు కలిపి నరైన్‌కు కోల్‌కతా యాజమాన్యం చెల్లించిన మొత్తం వేతనం అక్షరాల 95.6కోట్ల రూపాయలు. ఈ సీజన్‌కు నరైన్‌ను కేకేఆర్ రూ.6కోట్లను చెల్లించి రిటైన్ చేసుకుంది. దీంతో ఐపీఎల్‌లో నరైన్ వేతనం మొత్తం 100కోట్ల రూపాయలను దాటనుంది. ఐపీఎల్‌లో 100కోట్ల రూపాయలు అందుకున్న విదేశీ ప్లేయర్‌గానూ నరైన్ రికార్డు నెలకొల్పాడు.

బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ నరైన్‌కు సరైనోడు లేడు..
నరైన్ ఇటు తన మిస్టరీ స్పిన్‌తో పాటు.. భీకర హిట్టింగ్ చేయగల యోధుడు. ఐపీఎల్ 2017సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 15బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి తనలోని బ్యాటింగ్ పదును చూపించాడు. అప్పటి నుంచి అతను తరుచుగా బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా రావడం ప్రారంభించాడు. నరైన్ ఉన్నంత సేపు బౌలర్ ఎవరనేది చూడకుండా ఉతికి ఆరేస్తాడు. ఇక ఐపీఎల్ కెరీర్ పరంగా చూసుకుంటే.. నరైన్ ఐపీఎల్లో మొత్తం 141మ్యాచ్‌లు ఆడాడు. బ్యాటింగ్ విభాగం విషయంలో 162.3 స్ట్రైక్ రేట్‌తో 976పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 75నాటౌట్. బౌలింగ్ విషయానికి వస్తే.. 6.65 ఎకానమీతో 149వికెట్లు తీశాడు. అత్యుత్తమ ప్రదర్శన 5వికెట్లు/19పరుగులు. ఇక 7సార్లు 4వికెట్లు తీశాడు. అలాగే ఐపీఎల్ కాకుండా ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా కేకేఆర్ తరఫున ఆడడంతో మొత్తం కేకేఆర్ తరఫున 150మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగానూ రికార్డ్ నెలకొల్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications