Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అసలు వరల్డ్ కప్‌ చూడను - రియాస్ పరాగ్ సంచలన వ్యాఖ్యలు

ప్రతి ఆటగాడు తమ దేశం తరఫున ప్రపంచకప్ ఆడాలని, ట్రోఫీని అందుకోవాలని భావిస్తుంటారు. ఆ దిశగా కెరీర్‌ను మలుచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఐపీఎల్ స్టార్ ప్లేయర్ రియాన్ పరాగ్ వరల్డ్ కప్ చూడాలనుకోవట్లేదని పేర్కొనడం చర్చనీయాశంగా మారింది. టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌కు ఏఏ జట్లు చేరుతాయని భావిస్తున్నారని అడిగిన ప్రశ్నకు పరాగ్ మెగాటోర్నీయే చూడనని చెప్పడం గమనార్హం. తాను ప్రపంచకప్ ఆడితే చెప్పేవాడినని పరాగ్ అన్నాడు

ఐపీఎల్-2024లో రాజస్థాన్ రాయల్స్ తరఫున రియాన్ పరాగ్ అదరగొట్టిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌ ప్లేఆఫ్స్‌కు చేరడంలో పరాగ్‌ది కీలక పాత్ర. ఆరెంజ్ క్యాప్ కోసం ఓ దశలో విరాట్ కోహ్లితో పోటాపోటీగా పరుగులు చేశాడు. అతిత్వరలో టీమిండియా తలుపు తట్టేలా బ్యాటింగ్ చేశాడు. 14 ఇన్నింగ్స్‌ల్లో 52 సగటు, 149 స్ట్రైక్‌రేటుతో 573 పరుగులు చేశాడు. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో కోహ్లి (741), రుతురాజ్ గైక్వాడ్ (583) తర్వాత మూడో స్థానంలో నిలిచాడు.

I Don t Even Want to Watch the World Cup - Riyan Parag

అయితే రియాన్ పరాగ్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాడు. ఇటీవల ఆన్‌లైన్ గేమింగ్ లైవ్ స్ట్రీమింగ్ సెషన్‌లో పాల్గొన్న పరాగ్ తన యూట్యూబ్ హిస్టరీని లీక్ చేసుకుని విమర్శలపాలయ్యాడు. స్ట్రీమింగ్ సందర్భంగా అతను యూట్యూబ్ ఓపెన్ చేయగా, అందులో తన సెర్చ్ హిస్టరీ చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. స్టార్ హీరోయన్ల హాట్ వీడియోలు వెతికిన తన యూట్యూబ్ హిస్టరీ ప్రత్యక్షమైంది. అన్యన పాండే హాట్, సారా అలీ ఖాన్ హాట్ అంటూ సెర్చ్ హిస్టరీలో ఉంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో వరల్డ్ కప్ చూడాలనుకోవట్లేదని పేర్కొనడంతో పరాగ్ మరోసారి వార్తల్లోకెక్కాడు. ''టాప్-4లో నిలిచే జట్లు ఏవని చెబితే, ఆ సమాధానం పక్షపాతంగా ఉంటుంది. నిజాయతీగా చెప్పాలంటే వరల్డ్ కప్‌ను చూడాలనుకోవట్లేదు. అంతిమంగా ఎవరు విజయం సాధిస్తారనే చూస్తా. దాంతో సంతోషిస్తా. ఒకవేళ ప్రపంచకప్‌లో నేను పాల్గొంటే టాప్-4లో నిలిచేదెవరు అని ఆలోచిస్తాను'' అని 22 ఏళ్ల రియాన్ పరాగ్ పేర్కొన్నాడు.

Story first published: Monday, June 3, 2024, 11:15 [IST]
Other articles published on Jun 3, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+