
విమర్శకుల నోళ్లు మూయించిన పాండ్యా:
అతను ఆల్ రౌండర్ కాదు. కపిల్ దేవ్ అంతటివాడు కాదంటూ మీడియా ముందు విమర్శలు చేసిన వాళ్లంతా ముక్కున వేలేసుకున్నారు. 'నేనెప్పుడూ కపిల్ దేవ్ అవ్వాలనుకోలేదు. నన్ను హార్దిక్ పాండ్యాలాగే ఉండనివ్వండి. పాండ్యాలా ఉండటమే నాకిష్టం. నేను 41 వన్డేలు, 10 టెస్టులు మాత్రమే ఆడాను. కపిల్ దేవ్‌లా అన్ని మ్యాచ్‌లు ఆడలేదు' అని చెప్పుకొచ్చాడు ఈ యువ భారత్ ఆల్‌రౌండర్.
అశ్విన్ విరామానికి వెళ్లొచ్చేలోగానే:
తొలి సెషన్‌లోనే ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్‌ను హార్దిక్ పాండ్యా (5/28), ఇషాంత్ (2/32), బుమ్రా (2/37) ఫుల్‌లెంగ్త్ బంతులతో వణికించారు. లంచ్ వరకు వికెట్లను కాపాడుకున్న కుక్ (29), జెన్నింగ్స్ (20) మూడు బంతుల వ్యవధిలో ఔట్‌కావడంతో ఆతిథ్య జట్టు వికెట్ల పతనం మొదలైంది. రూట్ (16)తో కలిసి మూడో వికెట్‌కు 21 పరుగులు జోడించి పోప్ (10) వెనుదిరిగాడు. వెన్నునొప్పితో మైదానం వీడిన అశ్విన్ ఒకే ఒక్క ఓవర్‌తో సరిపెట్టుకున్నాడు. అతను తిరిగి వచ్చేలోగా హార్దిక్ పాండ్యా దెబ్బకు ఇంగ్లాండ్ విలవిలలాడింది.

తానొక్కడే ఐదు వికెట్లను పడగొట్టి:
25వ ఓవర్‌లో బౌలింగ్‌కు దిగిన పాండ్యా కేవలం 28 బంతుల వ్యవధిలో ఐదు వికెట్లు తీసి పరుగుల వేటలో ఇంగ్లండ్‌ను పూర్తిగా కట్టడి చేశాడు. మొదట రూట్ వికెట్ తీసిన పాండ్యా.. వరుస విరామాల్లో మిగతా వాళ్ల పని పట్టాడు. స్టోక్స్ (10) బెయిర్‌స్టో (15)ఐదో వికెట్‌కు 22 పరుగులు జోడించినా.. ఇంగ్లండ్ 108 పరుగులకు సగం జట్టు పెవిలియన్‌కు చేరింది. రెండో ఎండ్‌లో షమీ, బుమ్రా కూడా వికెట్లు తీయడంతో పరుగుల వేగం మందగించింది. 31వ ఓవర్‌లో వోక్స్ (8)ను ఔట్ చేసిన పాండ్యా.. 33వ ఓవర్‌లో ఐదు బంతుల వ్యవధిలో రషీద్ (5), బ్రాడ్ (0) వికెట్లు తీసి ఇన్నింగ్స్‌కు తెరదించాడు.

292 పరుగుల భారీ ఆధిక్యంలో టీమిండియా:
ఇంగ్లాండ్‌తో నాటింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ జట్టు భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. మ్యాచ్‌లో రెండో రోజైన ఆదివారం ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 124/2తో నిలిచి మ్యాచ్‌పై పూర్తి స్థాయిలో పట్టు బిగించింది. క్రీజులో చతేశ్వర్ పుజారా (33), విరాట్ కోహ్లి (8) ఉండగా.. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 168 పరుగుల ఆధిక్యంతో కలుపుకుని ఇప్పుడు భారత్ 292 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications













