For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్ ఆడేది.. విమర్శకుల నోళ్లు మూయించడానికి కాదు: పూజారా

I Dont Play International Cricket To Silence My Critics: Cheteshwar Pujara

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా చెలరేగి ఆడుతోన్న పూజారా.. 17వ సెంచరీతో మరింత ఇమేజ్ సంపాదించుకున్నాడు. రెండో టెస్టులో వరుసగా వికెట్లు పారేసుకున్న టీమిండియా బాక్సింగ్ డే టెస్టులో చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. తొలి రోజు కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి రెండో రోజు 215/2 ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగి 443/7తో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. తొలి రోజు ఆట నుంచి క్రీజులో పాతుకుపోయిన చతేశ్వర్‌ పుజారా సెంచరీకి మించిన స్కోరుతో ఆసీస్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని 106 పరుగులు సాధించాడు. 280 బంతులు ఎదుర్కొన్న పుజారా 10 ఫోర్లతో కెరీర్‌లో 17వ సెంచరీ సాధించాడు. ఆసీస్‌పై పుజారాకు ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం. ఈ క్రమంలో కమిన్స్‌ వేసిన చక్కని బంతికి పుజారా క్లీన్‌ బౌల్డ్‌ అయి పెవిలియన్ చేరుకున్నాడు.

ఇష్టమైన పని కాబట్టే చేస్తున్నా

ఇష్టమైన పని కాబట్టే చేస్తున్నా

మ్యాచ్ అనంతరం పూజారా మీడియా సమావేశానికి హాజరై మాట్లాడిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్టు చేసింది. 'నేను అంతర్జాతీయ క్రికెట్ ఆడే ఉద్దేశ్యం.. విమర్శకుల నోళ్లు మూయించాలని మాత్రమే కాదు. నాకు జట్టుకు పరుగులు సమకూర్చడం చాలా ఇష్టమైన పని కాబట్టే చేస్తున్నాను. అంతేకానీ, ప్రతి విషయాన్ని పట్టించుకుని వివాదాల్లోకి వెళ్లాలని కాదు. నా పని పరుగులు సాధించడం. నేను అదే చేస్తున్నా. సొంత గడ్డపైనైనా, విదేశీ గడ్డపైన అయినా సరే.

కొన్ని సార్లు అది సాధ్యపడకపోవచ్చు కూడా

ఈ క్రమంలో కొన్ని సార్లు విమర్శలకు గురి కావచ్చు. వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ఇలా భారత్ విజయాల పరంపరను సాధిస్తే అందరూ సంతోషించే విషయమే కదా. సొంతగడ్డపై పరుగులు సాధించడం కొంచెం తేలికనే చెప్పాలి. కానీ, విదేశీ గడ్డపై పరుగులు రాబట్టేందుకు చాలా కష్టపడాలి. కొన్ని సార్లు అది సాధ్యపడకపోవచ్చు కూడా. ఆసీస్ పర్యటనలో ఇప్పటికీ రెండు సెంచరీలు పూర్తి చేశా. నేను పరుగులు చేయగలననే నమ్మకం నాకుంది. కొన్ని సార్లు విదేశీ గడ్డపై అది సాధ్యపడదంతే'

సచిన్, సెహ్వాగ్, కోహ్లీ, రహానె.. ల సరసన పూజారా

సచిన్, సెహ్వాగ్, కోహ్లీ, రహానె.. ల సరసన పూజారా

బాక్సింగ్‌ డే టెస్టు మ్యాచ్‌లో సెంచరీ సాధించడం ద్వారా పుజారా సరికొత్త రికార్డుల్లో నిలిచి దిగ్గజాల సరసన చేరాడు. ఇప్పటి వరకు మెల్‌బోర్న్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో సచిన్ టెండూల్కర్ (1999), వీరేంద్ర సెహ్వాగ్ (2003), విరాట్ కోహ్లి (2014), అజింక్య రహానె (2014) మాత్రమే సెంచరీలు సాధించారు. తాజాగా ఈ జాబితాలోకి పుజారా కూడా చేరాడు.

పేలవంగా పేలిన రికార్డు

పేలవంగా పేలిన రికార్డు

పుజారా కెరీర్‌లో ఇదే అత్యంత నిదానమైన సెంచరీ. ఇంగ్లాండ్‌తో 2012లో 248 బంతుల్లో సెంచరీ మార్క్‌ని అందుకున్న పుజారా.. తాజాగా ఆ రికార్డుని మరింత పేలవంగా సవరించాడు. ఇక భారత్ తరఫున అత్యంత నెమ్మది సెంచరీ రికార్డుల్లో రవిశాస్త్రి 307 బంతులతో అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత సునీల్ గవాస్కర్ 286 బంతులతో పుజారా కంటే ముందు వరుసలో ఉన్నారు.

1
43625
Story first published: Thursday, December 27, 2018, 16:50 [IST]
Other articles published on Dec 27, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+