గెలిచేందుకు వచ్చాం.. గిల్లికజ్జాల కోసం కాదు: విరాట్ కోహ్లీ

సిడ్నీ: మైదానంలో ఆస్ట్రేలియా ఆటగాళ్ల కవ్వింపుల తీరు మారడం కష్టమని భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పెయిన్ కెప్టెన్సీలోని ఆసీస్ జట్టు టెస్ట్ సిరీస్‌లో దూకుడుగానే ఉంటుందన్నాడు. దానికి తగ్గట్టుగానే టీమిండియా మరింత బలపడుతోందని విరాట్ అన్నాడు. డిసెంబరు 6 నుంచి అడిలైడ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుండగా.. క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టుతో జరిగిన నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ శనివారం డ్రాగా ముగిసింది.

4 సెంచరీలు బాదేసి 694 పరుగులు
భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో మునుపటిలా కవ్వింపులకి దిగకుండా హుందాగా వ్యహరిస్తామని ఆస్ట్రేలియా చెప్తుండటంపై తాజాగా విరాట్ కోహ్లి స్పందించాడు. 2014 పర్యటనలో కోహ్లీతో ఆసీస్ మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ పెద్ద ఎత్తున కవ్వింపులకి దిగాడు. ఒకానొక దశలో.. కోహ్లీని గాయపరిచేందుకు కూడా అతను వెనుకాడలేదు. అయితే.. ఆ ఆధిపత్య పోరుని సవాల్‌గా తీసుకున్న విరాట్ కోహ్లి నాలుగు సెంచరీలు బాదేసి ఏకంగా 694 పరుగులు చేశాడు. అయినప్పటికీ భారత్ జట్టు ఆ సిరీస్‌ని గెలవలేకపోయింది.

మేం బాగా అనుభవం గడించాం
ఆస్ట్రేలియా గత పర్యటనతో పోలిస్తే.. ఇప్పుడు మేం బాగా అనుభవం గడించాం. జట్టు ఆడుతున్న తీరు చూస్తుంటే.. కచ్చితంగా సిరీస్ గెలవగలమనే నమ్మకం ఉంది. అయితే.. కేవలం ఒకటి లేదా రెండు టెస్టులకే మా ఆధిపత్యాన్ని పరిమితం చేయదల్చుకోలేదు. సిరీస్ మొత్తం అదే జోరుని కొనసాగించాలని ఆశిస్తున్నాం. ఇక ఆస్ట్రేలియా టీమ్ గత పర్యటన తరహాలో పెద్ద ఎత్తున కవ్వింపులకి దిగకపోవచ్చు.

సిరీస్ గెలిచే సత్తా టీమిండియాకుంది
కానీ.. వారి శరీర భాష, కవ్వింపు ఆలోచనలు అలానే ఉంటాయని నా భావన. ఎందుకంటే.. వాళ్లు సుదీర్ఘకాలంగా అలానే క్రికెట్ ఆడుతున్నారు కాబట్టి. మాపై వస్తున్న ఆరోపణలను పట్టించుకునే సమయం ప్రస్తుతం మాకు లేదు. ఆసీస్ జట్టు చాలా దూకుడుగా ఉంటుంది. వాళ్ల దూకుడుకు టీమిండియా ఆటగాళ్లు అడ్డుకట్ట వేయగలరు. నైపుణ్యాల పరంగా, అనుభవం పరంగా, ఆటపరంగా చూస్తే ఇక్కడ సిరీస్ గెలిచే సత్తా టీమిండియాకు ఉంది.' అని కోహ్లీ వెల్లడించాడు.
వార్మప్ మ్యాచ్‌లో వికెట్ తీసిన కోహ్లీ
సిడ్నీలోని రేడియో కేంద్రం ఇంటర్వ్యూలో విరాట్ శనివారం పాల్గొన్నాడు. అయితే, సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్‌లో కోహ్లీ ఎట్టకేలకు సక్సెస్ అయ్యాడు. మూడో రోజు ఆటలో రెండు ఓవర్లు పాటు బౌలింగ్ వేసి వికెట్ తీయలేని విరాట్ కోహ్లీ.. శనివారం చివరి రోజు ఆటలో ఎట్టకేలకు వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. శనివారం సౌత్ ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ హ్యారీ నీల్సన్‌ను ఔట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications