అందరికీ తెలిసేలా బ్యానర్ పట్టుకుని తిరగలేను!: తన వ్యవహారశైలిపై కోహ్లీ


హైదరాబాద్: నేనెవరో అందరికీ తెలిసేలా బ్యానర్ పట్టుకుని తిరగలేనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య బుధవారం ఉదయం 5.30 గంటల నుంచి మూడో టెస్టు మెల్ బోర్న్ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.

బ్యానర్ పట్టుకుని తిరగలేను
ఈ నేపథ్యంలో మంగళవారం కోహ్లీ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో మైదానంలో తన వ్యవహారశైలిపై విమర్శలపై విమర్శల ప్రస్తావనను విలేకర్లు తీసుకొచ్చారు. దీనిపై కోహ్లీ కాస్తంత ఘాటుగానే బదులివ్వడంతో పాటు తనను విమర్శించే వారి కోసం తాను బ్యానర్ పట్టుకుని తిరగలేనని సమాధానమిచ్చాడు.

నేను ఏం చేస్తున్నాను?
"నేను ఏం చేస్తున్నాను? ఎలా ఆలోచిస్తున్నాను? అనే విషయాల్ని అందరికీ తెలిసేలా నేను బ్యానర్ పట్టుకుని తిరగలేను. అదేవిధంగా నన్ను ఇలా ఇష్టపడండి అని కూడా నేను చెప్పలేను. ఎందుకంటే, అవి ఆ విమర్శలన్నీ వారి వ్యక్తిగత అభిప్రాయాలు. వాటిని నేను నియంత్రించలేను" అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

నా దృష్టి అంతా మెల్‌బోర్న్ టెస్టుపైనే
"ప్రస్తుతం నా దృష్టి అంతా మెల్‌బోర్న్ టెస్టులో జట్టుని గెలిపించడంపైనే ఉంది. ఇంకో విషయం చెప్పాలంటే నాపై వచ్చే వార్తలు, విమర్శలు గురించి నేను పెద్దగా పట్టించుకోను, అసలు వాటి గురించే నాకు తెలియదు. అయితే ప్రతి ఒక్కరికీ ఒక అభిప్రాయం ఉంటుంది" అని కోహ్లీ మీడియా సమావేశంలో అన్నాడు.

రెండో టెస్టులో కోహ్లీతీరుపై విమర్శలు
తొలి రెండు టెస్టుల్లో చెరో మ్యాచ్ నెగ్గడంతో సిరిస్ 1-1తో సమం అయింది. దీంతో బాక్సింగ్ డే టెస్టుపై ఆసక్తి నెలకొంది. రెండో టెస్టులో ఓటమికి గాను విరాట్ కోహ్లీ ఒత్తిడిలో ఉన్నాడు. పెర్త్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్‌తో కోహ్లీ మాటల యుద్ధానికి దిగడంపై కోహ్లీ తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications