For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బ్రేవో సంచలన వ్యాఖ్యలు.. సీఎస్‌కే రాయుడిని ఎందుకు తీసుకుందో అర్ధం కావడం లేదు!!

I dont know why CSK bought you: Dwayne Bravo reveals how he teases team man Ambati Rayudu

ఆంటిగ్వా: టీమిండియా క్రికెటర్‌ అంబటి రాయుడిపై విండీస్ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో సంచలన వ్యాఖ్యలు చేశాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) రాయుడి వంటి టెంపర్‌ పర్సన్‌ను ఎందుకు జట్టులోకి తీసుకుందో అర్ధం కావడం​ లేదన్నాడు. రాయుడికి కాస్త కోపం ఎక్కువ‌ అని, అందుకే త‌ర‌చూ అత‌డిని రెచ్చ‌గొట్టేవాడినని తెలిపాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో రాయుడు-బ్రేవోలు కలిసి సీఎస్‌కే తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే. సీఎస్‌కేతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్‌లో పాల్గొన్న బ్రేవో.. రాయుడును ఎలా ఏడిపించాడో బ్రావో వెల్లడించాడు.

సీఎస్‌కే ఎందుకు కొనుగోలు చేసిందో:

సీఎస్‌కే ఎందుకు కొనుగోలు చేసిందో:

'అంబటి రాయుడు నా ఫేవరెట్‌ ప్లేయర్లలో ఒకడు. మేమిద్దరం ముంబై ఇండియన్స్‌కు ఆడాం. కానీ.. ఇద్దరం కలిసి ఆడిన సందర్భాలు తక్కువ. నా తరహాలోనే అతను ప్లేయర్‌. కానీ నా టాలెంట్‌ను తక్కువ చేసి చూసేవాడు. అతను భారత క్రికెటర్‌ కావడం వల్ల నాపై ఏవోవే చెప్పేసేవాడు. రాయడుకి కోపం ఎక్కువ‌. అతను కరెక్ట్‌ కాదని నేను చెప్పగలను. ఒక చెత్త క్రికెటర్‌ అని చెబుతాను. అసలు సీఎస్‌కేకు రాయుడు అవసరం లేదు. అలాంటి టెంపర్‌ గయ్‌ రాయుడిని ఎందుకు సీఎస్‌కే కొనుగోలు చేసిందో నాకు అర్ధం కావడం లేదు' అని బ్రావో అన్నాడు.

రాయుడు నిజమైన క్రికెటర్‌:

రాయుడు నిజమైన క్రికెటర్‌:

'రాయుడు సీఎస్‌కేకు ఆడిన తొలి సీజన్‌లో ఎప్పుడూ నా పక్కనే కూర్చొని ఉండేవాడు. నాకు అతను నచ్చక నేను కూడా నెగిటివ్‌ విషయాల్నే మాట్లాడేవాడిని. నన్నుఎప్పుడూ తప్పుడుగా చూపించే యత్నం చేసేవాడు. కానీ.. నేను రాయుడి సక్సెస్‌ను ఆశించే వాడిని. అతనొక ప్రత్యేకమైన వ్యక్తి. మీరు ఏ వ్యక్తి గురించైనా తెలుసుకోవాలంటే ముందు అతనితో సఖ్యత ద్వారానే తెలుసుకుంటాం. ఒకవేళ తెలియకపోతే సదరు వ్యక్తి గురించి చెడు అభిప్రాయం వస్తుంది. జట్టు పరంగా చూస్తే రాయుడు నిజమైన క్రికెటర్‌. క్రికెట్‌ను బాగా ఆస్వాదిస్తాడు' అని 37 ఏళ్ల ఆల్‌రౌండర్‌ పేర్కొన్నాడు.

బ్యాటింగే రాదంటూ ఆటపట్టించేవాడిని:

బ్యాటింగే రాదంటూ ఆటపట్టించేవాడిని:

'రాయుడు, నేను ఇద్దరం ఉన్నపుడు.. నువ్వు మంచి ఆట‌గాడివి కాదు, నీకు బ్యాటింగే రాదు, అస‌లు చెన్నై నిన్నేందుకు కొనుగోలు చేసిందో అంటూ అత‌డిని ఆట‌ప‌ట్టించేవాడిని. నా మాట‌లు అబద్ధాల‌ని నిరూపించేందుకు మైదానంలో వంద శాతం కృషిచేసేవాడు. అలా రాయుడు రాణించిన ప్ర‌తీసారి నేను చాలా ఆనంద‌ప‌డేవాడిని. అత‌డి గురించి నాకు పూర్తిగా తెలుసు కాబ‌ట్టే ఆలా చేసేవాడిని' అని బ్రేవో చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్-12లో విఫలం:

ఐపీఎల్-12లో విఫలం:

2018లో ముంబై ఇండియన్స్ నుండి చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు మారిన అంబ‌టి టాపార్డ‌ర్‌లో బ్యాటింగ్‌కు దిగి అద‌ర‌గొట్టాడు. సీజ‌న్‌లో 602 ప‌రుగులు సాధించి భారత జట్టులో పున‌రాగ‌మ‌నం చేసిన విష‌యం తెలిసిందే. అయితే 2019 వన్డే ప్రపంచకప్ ముందు జరిగిన ఐపీఎల్-12లో నిరాశపరచడంతో.. మెగా టోర్నీకి ఎంపిక కాలేదు. దీంతో ఆగ్రహం చెందిన అతడు రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఆపై మళ్లీ వెనక్కు తీసుకున్నాడు. ఇటీవల ఐపీఎల్-13 కోసం చెన్నైలో ప్రాక్టీస్ కూడా చేసాడు. కరోనా కారణంగా మళ్లీ ఇంటికి చేరుకున్నాడు.

Story first published: Monday, April 20, 2020, 19:40 [IST]
Other articles published on Apr 20, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+