బ్రావోతో కలిసి ధోని టేబుల్ టెన్నిస్: సోషల్ మీడియాలో వీడియా వైరల్

హైదరాబాద్: దీపావళి పండుగను పురస్కరించుకుని ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ తన ట్విట్టర్‌లో పోస్టు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తనలోని టేబుల్ టెన్నిస్ స్కిల్‌ను బయటపెట్టాడు.
క్రికెట్‌కు మారడానికి ముందు మహేంద్ర సింగ్ ధోని తన కెరీర్‌ను ఫుట్‌బాల్ గోల్ కీపర్‌గా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, వీడియోలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సహచర ఆటగాడు డ్వేన్ బ్రావోతో సులభంగా టేబుల్ టెన్నిస్ ఆడుతూ ఆ ఆటలో కూడా తనకు ప్రావీణ్యం ఉందని నిరూపించుకున్నాడు.
ధోని ఆడిన బ్యాక్‌హ్యాండ్ స్మాష్‌కు
ధోని ఆడిన బ్యాక్‌హ్యాండ్ స్మాష్‌కు డ్వేన్ బ్రావో సైతం ఆశ్చర్యపోయాడు. దీంతో డ్వే బ్రావో నేను ర్యాలీ ఆడుతున్నా అని చెప్పగా ధోని తనదైన స్టైల్‌లో నేను ర్యాలీలు ఆడను అంటూ చెప్పడం అద్భుతంగా ఉంది. ఏదేమైనా ధోని, బ్రావో సుదీర్ఘ ర్యాలీ ఆడినప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెనే పాయింట్ గెలిచాడు.

రవీంద్ర జడేజా బిలియర్డ్స్
ఈ ప్రమోషల్ షూట్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని మరో ఆటగాడు రవీంద్ర జడేజా బిలియర్డ్స్ ఆడుతూ కనిపించాడు. ఇటీవల ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ నిష్క్రమించిన తర్వాత ధోని రెండు నెలలు పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. భారత ఆర్మీకి సేవలందించేందుకు గాను ఆ తర్వాత విండిస్ పర్యటనకు దూరమయ్యాడు.

వరల్డ్‌కప్ తర్వాత అందుబాటులో లేని ధోని
ఆ తర్వాత సొంతగడ్డపై జరిగిన దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టీ20 సిరీస్‌కు కూడా ధోని అందుబాటులో లేడు. వచ్చే నెలలో బంగ్లాదేశ్ టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో కూడా ధోనీ లేడు. అయితే, వచ్చే జనవరిలో ధోని పూర్తి ఫిట్‌నెస్‌తో సెలక్షన్ కమిటీకి అందుబాటులోకి రానున్నాడు. ఇప్పటికే ధోని తన ట్రైనింగ్‌ను ప్రారంభించాడు.

జిమ్‌లో ధోని కసరత్తులు
ఇందులో భాగంగా జిమ్‌లో ధోని కసరత్తులు చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి స్థాయి ఫిట్‌నెస్ అందుకోవడానికి జార్ఖండ్ అండర్-23 జట్టుతో కలిసి ధోని ప్రాక్టీస్ చేయనున్నాడు. ధోని రిటైర్మెంట్‌పై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మాట్లాడుతూ "ధోని భారత జట్టుకు గర్వకారణమని, తన హయాంలో అతడికి సముచిత గౌరవం లభిస్తుంది" అని అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications