రెండో స్ధానం కట్టబెడతారా?: కోపంతో ఊగిపోయిన పార్ధీవ్
హైదరాబాద్: ఇరానీ కప్‌లో భాగంగా గుజరాత్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా ఆటగాడు వృద్ధిమాన్ సాహా డబుల్ సెంచరీ సాధించి కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ టీమిండియా టెస్టు జట్టులో రెగ్యులర్ కీపర్ గా తమ తొలి ప్రాధాన్యత వృద్ధిమాన్ సాహాకే పేర్కొన్నాడు.
అంతేకాదు పార్ధీవ్ వికెట్ కీపింగ్ కంటే సాహానే మెరుగైన వికెట్ కీపర్ అని ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశాడు. ఎమ్మెస్కే ప్రసాద్ వ్యాఖ్యలకు మరింత బలాన్ని చేకూరుస్తూ టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ సైతం పార్థివ్ పటేల్ కంటే కోల్‌కతా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ వృద్ధిమాన్ సాహాకే తొలి ప్రాధాన్యం ఉంటుందని వ్యాఖ్యానించాడు.
ఇక టీమిండియా కెప్టెన్ కోహ్లీ సైతం తమ మొదటి ప్రాదాన్యత సాహాకే అని చెప్పడంతో పాటు తమ రెండో కీపర్ పార్ధీవ్ పటేల్ అని వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో పార్ధీవ్ పటేల్ పరోక్షంగా తన అసంతృప్తి వ్యక్తం చేశాడు. తనకు రెండో స్ధానాన్ని కట్టబెట్టడంపై ఎవరిని విమర్శించకుండానే తన మనసులోని మాటను బహిర్గతం చేశాడు.

సంతోషంగా జట్టు నుంచి తప్పుకున్నా
'నేను భారత్ జట్టులో స్థానం కోల్పోయినప్పుడు పునరాగమనం చేస్తానని అనుకోలేదు. ఆ సమయంలో సంతోషంగా జట్టు నుంచి తప్పుకున్నా. నేను విపరీతంగా శ్రమించి తిరిగి చాలా ఏళ్ల తరువాత జట్టులో స్థానం దక్కించుకున్నా' అని పేర్కొన్నాడు.

జట్టులో స్థానం కోసమే నేను క్రికెట్ ఆడటం లేదు
'కేవలం భారత జాతీయ జట్టులో స్థానం కోసమే నేను క్రికెట్ ఆడటం లేదు. వికెట్ కీపర్ గా నాకు కొన్ని పరిమితులున్నాయి.. అదే క్రమంలో లక్ష్యాలు కూడా ఉన్నాయి. వాటిని సాధించడం కోసం నేను ఎప్పుడూ యత్నిస్తూ ఉంటా. దీనిలో భాగంగానే నా మానసిక పరిస్థితిని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉంటా' అని పార్ధీవ్ అన్నాడు.

జట్టులోకి తిరిగి ఎలా వచ్చానో నాకు తెలుసు
'నేను భారత జట్టులోకి తిరిగి ఎలా వచ్చానో నాకు తెలుసు. నేను సత్తా చాటాను కాబట్టే జట్టులో స్థానం దక్కింది. నాకు గేమ్ అంటే ఇష్టం. ఆ క్రమంలోనే ఇప్పటికీ ఆడుతున్నా. కేవల భారత జట్టులో స్థానం కోసమైతే కాదు' అని పార్థీవ్ తన అసంతృప్తి వ్యక్తం చేశాడు.

పార్దీవ్‌కు సెలక్టర్ల నుంచి పిలుపు
కాగా, ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇంగ్లాండ్‌తో ముగిసిన టెస్టు జట్టులో పార్దీవ్ పటేల్ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. నిజానికి ఇంగ్లాండ్ సిరిస్‌కు వికెట్ కీపర్‌గా సాహా ఎంపికైనప్పటికీ గాయం కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు. ఈ క్రమంలో పార్దీవ్‌కు సెలక్టర్ల నుంచి పిలుపొచ్చింది.

సాహా తిరిగి కోలుకోవడంతో పార్థీవ్ రెండో స్ధానానికి పరిమితం
ఇంగ్లాండ్ టెస్టు సిరిస్‌లో చోటు దక్కించుకున్న పార్దీవ్ పటేల్ అద్భుతంగా ఆడి టెస్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే రెగ్యులర్ కీపర్ సాహా తిరిగి కోలుకోవడంతో పార్థీవ్ రెండో స్ధానానికి పరిమితం కావల్సి వస్తోంది. టీమిండియా టెస్టు జట్టుకు కీపర్‌గా ఎంపికయ్యే వికెట్‌కీపర్ బ్యాట్స్‌మెన్‌లో నెంబర్ వన్ చాయిస్ వృద్ధిమాన్ సాహాయేనని చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డాడు.

ఎమ్మెస్కే ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై పార్థీవ్ కోపం
గాయంతో జట్టుకు దూరమైన సాహా ఇరానీ కప్‌లో డబుల్ సెంచరీతో సత్తా చాటడం, ఫిట్‌నెస్ నిరూపించుకోవడం మంచి పరిణామమని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే ఎమ్మెస్కే ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు పార్థీవ్ పటేల్‌కు కోపాన్ని తెప్పించినట్లు కనబడుతున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications