Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచ కప్‌లో ఫేవరేట్లు ఎవరనేది నాకు అవసరం లేదు: పాంటింగ్

Ricky Ponting
బెంగళూరు: ప్రపంచ కప్ పోటీల్లో ఫేవరేట్లు ఎవరనేది తనకు అవసరం లేదని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నారు. ప్రపంచ కప్‌లో ప్రత్యేకించి ఫేవరేట్లు ఎవరూ లేరని ఆయన అన్నారు. కానీ భారత్, ఆస్ట్రేలియా తన దృష్టిలో బలమైన జట్లని ఆయన అన్నారు. భారత, దక్షిణాఫ్రికా జట్లు పటిష్టంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక్కడి పరిస్థితుల్లో బాగా ఆడే శ్రీలంక జట్టును తక్కువ అంచనా వేయలేమని ఆయన అన్నారు

పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు కూడా మెరుగైనవేనని ఆయన అన్నారు. తమ జట్టును తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. గత ప్రపంచ కప్‌నకు ముందు తాము తాము న్యూజిలాండ్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయామని, అయినా ప్రపంచ కప్ గెలుచుకున్నామని ఆయన అన్నారు. సచిన్ చేతుల మీదుగా భారత్ కప్ గెలవాలని అనుకుంటుండవచ్చునని, అయితే అలా జరగకూడదని తాను కోరుకుంటున్నానని ఆయన అన్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+