Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫేర్‌వెల్స్‌ను నమ్మను: చివరి మ్యాచ్‌పై ఆశిష్ నెహ్రా ఉద్వేగం

హైదరాబాద్: టీమిండియా వెటరన్ క్రికెటర్ ఆశిష్ నెహ్రా మరికొన్ని గంటల్లో తన క్రికెట్ కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడబోతున్నాడు. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో న్యూజిలాండ్‌తో బుధవారం రాత్రి 7 గంటలకు జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌తో నెహ్రా తన 18 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కి వీడ్కోలు చెప్పనున్నాడు.

తన రిటైర్మెంట్ మ్యాచ్‌పై బుధవారం ఆశిష్ నెహ్రా మీడియాతో మాట్లాడుతూ తాను ఫేర్ వేల్స్‌ని నమ్మనని, తన హార్డ్ వర్క్‌నే నమ్ముతానని చెప్పాడు. 'ధోని, కోహ్లీ లాంటి ఆటగాళ్లు భారత్ జట్టుకి దొరకడం నిజంగా అదృష్టం. నా వీడ్కోలు నిర్ణయం వెనుక ఎలాంటి కారణాలు లేవు. జట్టులో ప్రస్తుతం ఉన్న పేసర్లు భువీ, జస్‌ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. అందుకే వీడ్కోలు చెప్పేందుకు ఇదే తగిన సమయం అని నిర్ణయించుకున్నా' అని నెహ్రా అన్నాడు.

 సొంతగడ్డపై రిటైర్మెంట్

సొంతగడ్డపై రిటైర్మెంట్

ఏ క్రికెటర్‌కైనా సొంతగడ్డపై రిటైర్మెంట్ ప్రకటించడం కంటే వేరే అద్భుత క్షణం ఉండదు కదా? అని నెహ్రా వివరించాడు. 1999లో శ్రీలంకతో టెస్ట్‌ల ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఆశిష్ నెహ్రా ఇప్పటివరకు 17 టెస్టులు, 120 వన్డేలు, 26 టీ20 మ్యాచ్‌లాడాడు. 2003 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌పై ఆరు వికెట్లు తీసి జట్టులో చోటు దక్కించుకున్నాడు.

 18 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో ఎన్నో ఒడిదొడుకులు

18 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో ఎన్నో ఒడిదొడుకులు

18 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో ఎన్నో ఒడిదొడుకులు నెహ్రా ఎదుర్కొన్నాడు. జట్టులో అనేకమార్లు తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయినా ఎన్నడూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. సహచరులు ఒక్కొక్కరు నిష్క్రమిస్తున్నా.. ఏ మాత్రం నెరవకుండా జాతీయజట్టులో చోటు దక్కించుకుని యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచాడు.

గాయాల కారణంగా జట్టుకి దూరం

గాయాల కారణంగా జట్టుకి దూరం

అనంతరం గాయాల కారణంగా జట్టుకి చాలా రోజులు దూరమైపోయాడు. టెస్టులకు 2004లో, వన్డేలకు 2011 వరల్డ్ కప్ తర్వాత, 2014లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్ నుంచి రిటైరైన నెహ్రా టీ20ల్లో మాత్రం కొనసాగుతూనే ఉన్నాడు. భారత్ తరుపున 26 టీ20లు ఆడి 34వికెట్లు తీశాడు. ఈ ఏడాది మొదట్లో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20లో 3/19 అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు.

 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు

వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు

ధోని కెప్టెన్సీలో 2011లో ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో నెహ్రా సభ్యుడిగా కూడా ఉన్నాడు. ముఖ్యంగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో జరిగిన సెమీఫైనల్లో 2/33 ప్రదర్శనతో సత్తా చాటాడు. 38 ఏళ్ల వయస్సులో కూడా యువ ఆటగాళ్లకు దీటుగా బంతులు వేయడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు.

 తుది జట్టులో నెహ్రాకి దక్కని చోటు

తుది జట్టులో నెహ్రాకి దక్కని చోటు

ఇటీవల ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ కోసం భారత సెలక్టర్లు నెహ్రాని ఎంపిక చేసినా.. తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. ఆసీస్‌తో వన్డే సిరిస్ జరుగుతున్న సమయంలోనే నవంబరు 1న క్రికెట్‌కి గుడ్‌ బై చెప్పబోతున్నట్లు నెహ్రా ప్రకటించాడు. ఐపీఎల్‌లోనూ నెహ్రాకు మెరుగైన రికార్డు ఉంది.

 టీ20ల్లో ఘనమైన రికార్డు

టీ20ల్లో ఘనమైన రికార్డు

ఐపీఎల్‌లో మొత్తం 88 మ్యాచ్‌లాడిన నెహ్రా 106 వికెట్లు తీశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 4/10 అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ఐపీఎల్ కెరీర్‌లో ముంబై, ఢిల్లీ, పుణె, చెన్నై, సన్‌రైజర్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన నెహ్రా.. 100 వికెట్లు తీసిన అతి పెద్ద వయసున్న బౌలర్‌గా అరుదైన ఘనత సాధించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:18 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+