Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐసీసీ చైర్మన్‌గా కొనసాగడానికి సిద్దంగాలేని శశాంక్‌.. బీసీసీఐకి అన్నీ మంచి రోజులు!!

I do not want to continue from June 2020 says ICC Chairman Shashank Manohar

దుబాయ్‌: ఐసీసీ చైర్మన్‌ శశాంక్‌ మనోహర్‌ త్వరలో ఆ బాధ్యతల నుండి తప్పుకోనున్నారు. మనోహర్‌ పదవీ కాలం వచ్చే ఏడాది మేతో ముగియనుంది. ఇప్పటికే రెండు పర్యాయాలుగా ఐసీసీ చైర్మన్‌ పదవిలో కొనసాగుతున్న మనోహర్‌.. మరోసారి ఆ బాధ్యతలు చేపట్టేందుకు సిద్దంగా లేనట్లు తెలిపారు. అయితే ఐసీసీ డైరెక్టర్లు మాత్రం శశాంక్‌ మనోహర్‌నే కొనసాగించాలని భావిస్తున్నారు. దాదాపు ఐదేళ్లుగా ఐసీసీ చైర్మన్‌ పదవిలో ఉన్న మనోహర్‌.. మరో రెండేళ్లు కొనసాగలేనని డైరెక్టర్లకు తేల్చి చెప్పడట.

కొనసాగడానికి సిద్దంగా లేను:

కొనసాగడానికి సిద్దంగా లేను:

'మరో రెండేళ్లు ఐసీసీ చైర్మన్‌గా కొనసాగడానికి నేను సిద్దంగా లేను. మెజారిటీ ఐసీసీ డైరెక్టర్లు మరలా చైర్మన్‌ పదవిలో కొనసాగాలని ఒత్తిడి తెస్తున్నారు. మే వరకే పదవిలో కొనసాగుతాను. జూన్‌ తర్వాత చైర్మన్‌గా నేను ఉండను అని డైరెక్టర్లకు తేల్చిచెప్పాను. ఈ విషయంపై నేను చాలా స్పష్టతతో ఉన్నాను. ఐసీసీ చైర్మన్‌గా నా ప్రయాణం కచ్చితంగా వచ్చే ఏడాది మేతో ముగియనుంది' అని మనోహర్‌ తెలిపారు.

ఏకగ్రీవంగా ఎన్నిక:

ఏకగ్రీవంగా ఎన్నిక:

2016లో తొలిసారిగా ఐసీసీ స్వతంత్ర చైర్మన్‌ పదవిని ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు రెండు పర్యాయాలు మనోహర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఐసీసీ చైర్మన్‌గా ఆయన పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఐసీసీలో బీసీసీఐ అధికారాలకు గండి కొట్టారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా బీసీసీఐని ఇబ్బందులకు గురిచేశారు. 2014లో శ్రీనివాసన్‌ ఐసీసీ చైర్మన్‌గా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలన్నింటిని మార్చివేశారు.

బీసీసీఐకి ఆదాయంకు గండి:

బీసీసీఐకి ఆదాయంకు గండి:

బీసీసీఐతో పాటు క్రికెట్‌ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అపరిమిత అధికారాలను మనోహర్ రద్దు చేశారు. ఇంతలో ఆగకుండా శాశ్వత సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు. ఐసీసీ ఆదాయంలో ఈ మూడు దేశాల వాటాను భారీగా తగ్గించారు. ముఖ్యంగా బీసీసీఐకి సగం ఆదాయం పోయింది. మనోహర్‌ అండతో చిన్న దేశాల బోర్డులు కూడా బీసీసీఐని లెక్కచేయట్లేదు. త్వరలో మనోహర్‌ పదవీ కాలం ముగియనుండడంతో బీసీసీఐకి పరోక్షంగా ఎంతో లాభిస్తుందని క్రీడా పండితులు అంటున్నారు.

ఇక బీసీసీఐకి అన్నీ మంచి రోజులే:

ఇక బీసీసీఐకి అన్నీ మంచి రోజులే:

ఐసీసీ చైర్మన్‌ పదవిలో శశాంక్‌ మనోహర్‌ మరలా కొనసాగలేరని తెలుసుకున్న భారత అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 'బీసీసీఐకి పట్టిన దరిద్రం పోయిందని' ఓ నెటిజన్‌ పేర్కొన్నాడు. 'ఇక బీసీసీఐకి మంచి రోజులు రాబోతున్నాయని' మరికొంత మంది నెటిజన్లు అంటున్నారు. ఇవేకాదు రకరకాలుగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Story first published: Tuesday, December 10, 2019, 20:57 [IST]
Other articles published on Dec 10, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+