For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కాఫీ వివాదం.. ఆ 10 రోజులు బయటకే రాలేదు!!

Hardik Pandya Speaks On The 'Koffee With Karan' Controversy || Oneindia Telugu
I didnt step out of the house for 10 days: Hardik Pandya on Koffee with Karan row

ముంబై: జనవరి 1న తన ప్రేయసి నటాషాతో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న టీమిండియా ఆటగాడు హార్దిక్‌ పాండ్యా సంతోషంలో మునిగి తేలుతున్నాడు. కొత్త ఏడాదిలోని తొలి పది రోజులు పాండ్యా జీవితంలో సంతోషంగా గడిచాయి. అయితే సరిగ్గా సంవత్సరం క్రితం తలదించుకునే ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నాడు. 'కాఫీ విత్‌ కరణ్‌' చాట్‌షోలో మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాండ్యాపై బీసీసీఐ నిషేధం విధించి విచారణకు ఆదేశించింది. ఆ సమయంలో జట్టులోనూ స్థానం కూడా కోల్పోయాడు.

ఇంట్లోంచి బయటకే రాలేదు:

ఇంట్లోంచి బయటకే రాలేదు:

ఇండియా టుడే 'ఇన్‌స్పిరేషన్‌' కార్యక్రమంలో పాల్గొన్న హార్దిక్‌ పాండ్యా పలు విషయాలను పంచుకున్నాడు. 'బాగా గుర్తుంది. ఆ 10 రోజులు ఇంట్లోంచి బయటకే రాలేదు. సమస్యను ఎదుర్కోనే తీరు ఇదికాదని వారం, పది రోజుల తర్వాత అర్థమైంది. ఇది నా జీవితంలో ఎదురైన కఠిన పరిస్థితి అని తెలుసుకున్నా. ఆపై నా దృష్టినంతా ఆటపైకి మళ్లించా. జరిగింది మర్చిపోయాను. ఆర్నెల్లు సస్పెండ్‌ చేస్తారా? తర్వాత మ్యాచులోనే ఆడిస్తారా అని పట్టించుకోలేదు' అని పాండ్యా తెలిపాడు.

 అహంకారిగా భావించేవారు:

అహంకారిగా భావించేవారు:

'చాలామంది నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. నా గురించి తెలియక బాగా 'అహంకారం' ఉంది అనుకుంటారు. కొందరు నాతో మాట్లాడటం కష్టంగా భావిస్తారు. అయితే ఒక్కసారి మాట్లాడాక నేనేంటో తెలుస్తుంది. నన్ను పొరపాటుగా అర్థం చేసుకున్నామని ఎందరో చెప్పారు. అందుకే నా గురించి తెలిసిన నా సహచరులతో నా సంబంధాలు ఎంతో బాగున్నాయి. వారంతా నా సోదరులు. జట్టులోకి తిరిగొచ్చాక అందరూ నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. మానసికంగా, శారీరకంగా బాగున్నానో లేదో తెలుసుకోవడం ఒక మధుర స్మృతి' అని పాండ్యా పేర్కొన్నాడు.

ఇంతటి కష్టం ఎవరికీ రాకూడదు:

ఇంతటి కష్టం ఎవరికీ రాకూడదు:

'వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత ఎలా ఉన్నానో అని విరాట్‌ కోహ్లీ సందేశం పంపించాడు. బాగున్నాను కానీ ఎవరికీ ఇలాంటి అనుభవం ఎదుర్కోవాల్సి రాకూడదని బదులిచ్చా. మందులు వేసుకోవడం, కోలుకోవడం సవాల్‌గా అనిపించింది. 100 కేజీల బరువెత్తే నేను కనీసం కాలు కూడా కదపలేకపోయా. మన శరీరం సాధారణంగా 100% ప్రయత్నించేందుకు అలవాటై ఉంటుంది. కోలుకోవడం అంత సులభం కాదు. ఎంతో కష్టపడ్డా' అని పాండ్యా చెప్పుకొచ్చాడు.

ఫిట్‌నెస్‌ పరీక్షలో హార్దిక్‌ విఫలం:

ఫిట్‌నెస్‌ పరీక్షలో హార్దిక్‌ విఫలం:

హార్దిక్‌ పాండ్యా కీలకమైన ఫిట్‌నెస్‌ టెస్టులో విఫలమయ్యాడు.దీంతో అతడి పునరాగమనం మరింత ఆలస్యం కానుంది. గాయం కారణంగా దాదాపు నాలుగు నెలలుగా ఆటకు దూరమైన పాండ్యా న్యూజిలాండ్‌ పర్యటనకు ఎంపికవుతాడని అందరూ అంచనా వేశారు. ఫిట్‌నెస్‌ టెస్టులో విఫలమైన కారణంగా కివీస్‌ పర్యటనకు అతని పేరును పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇక కివీస్‌ పర్యటనకు వెళ్లే భారత్‌ 'ఎ' పరిమిత ఓవర్ల జట్టు నుంచి కూడా పాండ్యాను తప్పించారు. రంజీ మ్యాచ్‌ల్లో ఆడించకుండానే పాండ్యాను నేరుగా 'ఎ' జట్టులో తీసుకున్న విషయం తెలిసిందే. పాండ్యా స్థానంలో విజయ్‌ శంకర్‌కు చోటు కల్పించారు.

Story first published: Sunday, January 12, 2020, 15:55 [IST]
Other articles published on Jan 12, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+