నా రిటైర్మెంట్ మ్యాచ్‌లో ధోనీ ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు: దాదా

I didn’t expect it: Ganguly recalls when Dhoni handed him captaincy during his farewell Test in 2008

కోల్‌కతా: 2008 నవంబర్ నెలలో నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్.. భారత క్రికెట్‌కు ఒక ముఖ్యమైన సందర్భం. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ టీమిండియాకు అంతర్జాతీయంగా ఆడిన చివరి మ్యాచ్ అదే. ఈ ఆట దేశం తరఫున చివరిదని దాదా మ్యాచ్‌కు ముందే ప్రకటించాడు. ఇక ఆ టెస్ట్ చివరి రోజు గంగూలీ మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు ఆటగాళ్లు, అభిమానులు అతనికి గార్డ్ హాఫ్ హానర్‌ ఇచ్చారు. తాజాగా గంగూలీ తన చివరి టెస్ట్‌ను గుర్తుచేసుకున్నాడు.

ఇంగ్లండ్‌పై‌ విండీస్‌ ఆధిపత్యం.. 16 ఓవర్లలో 17 పరుగులే!!

నాగ్‌పూర్‌లో చివరి టెస్టు:

నాగ్‌పూర్‌లో చివరి టెస్టు:

రిటైర్మెంట్ మ్యాచ్‌ గురించి ఓపెనర్ మయాంక్ అగర్వాత్‌తో 'ఓపెన్ నెట్స్ విత్ మయాంక్' ఛాట్ షోలో బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ... 'నాగ్‌పూర్‌లో చివరి టెస్టు మ్యాచ్ ఆడాను. ఆరోజు మ్యాచ్‌లో ఆఖరి రోజు.. లాస్ట్ సెషన్ కూడా. విదర్భ స్టేడియంలో మెట్ల నుండి కిందకు వస్తున్నా. నా సహచరులు గార్డ్ హాఫ్ హానర్‌తో మైదానంలోకి ఆహ్వానించారు. ఎంతో గౌరవంగా, ఆనందంగా అనిపించింది. ఇక అభిమానులు అయితే కేరింతలతో సందడి చేశారు. ఆ క్షణం ఎప్పటికీ మర్చిపోను' అని అన్నాడు.

ధోనీ సర్‌ప్రైజ్‌ని ఊహించలేదు:

ధోనీ సర్‌ప్రైజ్‌ని ఊహించలేదు:

' నాగ్‌పూర్‌ టెస్ట్ చివరి సెషన్ ఆఖర్లో కెప్టెన్ ఎంఎస్ ధోనీ నా వద్దకు వచ్చి కెప్టెన్‌గా జట్టుని నడిపించమని కోరాడు. ఆ సర్‌ప్రైజ్‌ని నేను అస్సలు ఊహించలేదు. అప్పడు నా మైండ్‌ మొత్తం రిటైర్మెంట్‌ ఆలోచనలతో నిండిపోయింది కాబట్టి చివరి 3-4 ఓవర్లలో కెప్టెన్‌గా ఎలా వ్యవహరించానో నాకు గుర్తులేదు. మొత్తానికి భారత్ గెలిచింది' అని దాదా చెప్పాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 172 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది.

దాదా కెప్టెన్సీలోనే మహీ ఎంట్రీ:

దాదా కెప్టెన్సీలోనే మహీ ఎంట్రీ:

సౌరవ్ గంగూలీ తన కెప్టెన్సీ కాలంలో ఎందరో యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చాడు. అందరూ కూడా ఓ వెలుగువెలిగారు. ఇందులో యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, మొహమ్మద్ కైఫ్, గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, ఎంఎస్ ధోనీ, ఆశిష్ నెహ్రా లాంటి వారు ఉన్నారు. వీరందరూ విఫలమయిన ప్రతిసారి అండగా నిలిచేవాడు. దాదా కెప్టెన్సీలోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ధోనీ.. ఫస్ట్ మ్యాచ్‌లోనే డకౌటయ్యాడు. ఆ తర్వాత కూడా తక్కువ పరుగులకే పరిమితమయ్యాడు. అయినప్పటికీ ధోనీకి వరుస అవకాశాలిచ్చిన గంగూలీ.. బ్యాటింగ్ ఆర్డర్‌లో నెం.3లో పంపి ప్రోత్సహించాడు. ఆ తర్వాత అద్భుత సారథిగా ఓ వెలుగువెలిగాడు. దాంతో ధోనీ కూడా గంగూలీపై తన గౌరవాన్ని అలా చాటుకున్నాడు.

113 టెస్టులు.. 311 వన్డేలు:

113 టెస్టులు.. 311 వన్డేలు:

భారత్ తరఫున కెరీర్‌లో 113 టెస్టులాడిన సౌరవ్ గంగూలీ 16 శతకాలు, 35 అర్ధ శతకాల సాయంతో 7212 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 239. 311 వన్డేల్లో ప్రాతినిథ్యం వహించిన గంగూలీ.. 22 సెంచరీలు, 72 హాఫ్ సెంచరీలతో 11363 పరుగులు సాధించాడు. గంగూలీ కెప్టెన్సీలో 146 వన్డేలాడిన టీమిండియా.. 76 మ్యాచ్‌ల్లో గెలుపొంది 65 మ్యాచ్‌ల్లో ఓడింది. మరో ఐదు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. టెస్టు ఫార్మాట్‌లోనూ దాదా కెప్టెన్సీలో భారత్ జట్టు 49 మ్యాచ్‌లు ఆడగా.. 21 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 13 మ్యాచ్‌ల్లో ఓడిపోగా.. 15 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, July 11, 2020, 20:14 [IST]
Other articles published on Jul 11, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more