For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓడితే అందరికీ నేనే కనిపిస్తానా! కెప్టెన్సీపై వేటు వేస్తారా?- బాబార్ అజామ్

గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్‌ అనంతరం పాకిస్థాన్ క్రికెట్‌లో పెనుమార్పులు సంభవించాయి. బాబర్ అజామ్‌ కెప్టెన్సీపై వేటు వేశారు. మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లంటూ ప్రకటించారు. టెస్టులకు షాన్ మసూద్‌, టీ20లకు షాహిన్ అఫ్రిది అని తెలిపారు. అయితే వన్డే ఫార్మాట్ కెప్టెన్‌ పేరును వెల్లడించకముందే పాక్ క్రికెట్ బోర్డు యూటర్న్ తీసుకుంది. బాబర్‌కు తిరిగి పరిమిత ఓవర్లకు కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది.

అంతేగాక టీ20 వరల్డ్ కప్‌ను అందుకోవాలని ప్రత్యేక ప్రణాళికలు రచించింది. రిటైర్మెంట్ ప్రకటించిన మహ్మద్ అమీర్, ఇమాద్ వసీమ్‌ను తిరిగి జట్టులోకి తీసుకువచ్చింది. ఇక పాకిస్థాన్ ఆటగాళ్లకు ఫిట్‌నెస్ మెరుగుపర్చడానికి ఆర్మీ శిక్షణ కూడా ఇచ్చింది. కానీ పొట్టి కప్‌లో దారుణంగా విఫలమైంది. తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. అమెరికాను తక్కువగా అంచనా వేసి కంగుతింది. అనంతరం ఎప్పటిలానే భారత్ చేతిలో చిత్తుగా ఓడింది.కెనడా, నెదర్లాండ్స్‌పై ఓదార్పు విజయాలు సాధించి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

I Can t Play in Every Player s Place Babar Azam on Pakistan s T20 World Cup Elimination

దీంతో పాకిస్థాన్ జట్టుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆ దేశ మాజీ క్రికెటర్లు, అభిమానులు పాక్ టీమ్‌పై మండిపడుతున్నారు. బాబర్ అజామ్‌ కెప్టెన్సీ నుంచి తప్పించాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో విమర్శలపై మీడియా సమావేశంలో బాబర్ అజామ్ స్పందించాడు. జట్టు ఓటమిపాలైతే కెప్టెన్ కావడంతో తనపైనే అందరి దృష్టి ఉంటుందని, అయితే 11 మంది స్థానాల్లో తానొక్కడినే ఆడలేనని బాబర్ అన్నాడు. ప్రస్తుతం సారథి బాధ్యతలు వదులుకునే ఉద్దేశం తమకు లేదని చెప్పాడు.

''2023 వన్డే ప్రపంచకప్ అనంతరం కెప్టెన్సీని వదులుకోవాలనుకున్నాను. స్వతహాగా తప్పుకున్నాను. ఆ తర్వాత తిరిగి సారథి బాధ్యతలు అందించడం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్ణయం. ఇక పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లిన తర్వాత టీ20 వరల్డ్ కప్ ప్రదర్శన గురించి సమీక్షిస్తాం. అయితే ఒకవేళ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని భావిస్తే ఆ నిర్ణయం నేనే చెప్తాను. దాని గురించి ఏదీ దాచిపెట్టను. ఏం జరిగినా బహిరంగంగానే వెల్లడిస్తాను. ప్రస్తుతానికి దాని గురించి ఎలాంటి ఆలోచన లేదు. అంతిమంగా ఏదైనా పీసీబీ నిర్ణయమే''

''ఏదో ఒక్క ప్లేయర్ వల్ల వరల్డ్ కప్‌లో ఓటములు ఎదురుకాలేదు. మేం జట్టులానే గెలిచాం, ఓడాం. అయితే కెప్టెన్‌గా మీరు నన్ను బాధ్యుడిగా చూపించవచ్చు. కానీ జట్టులో ఉన్న ప్రతి ఒక్కరి స్థానంలో నేను ఆడలేను కదా? అక్కడ 11 మంది ఉన్నారు. వాళ్లకు వాళ్ల బాధ్యతలు ఉన్నాయి. అందుకే ప్రపంచకప్ ఆడటానికి వాళ్లు వచ్చారు. అయితే జట్టుగా మేం విఫలమయ్యామని భావిస్తున్నా. దాన్ని మేం అంగీకరించాల్సిందే. కెప్టెన్‌గా ఎవరినీ నిందింలేను'' అని బాబర్ అజామ్ అన్నాడు.

Story first published: Monday, June 17, 2024, 15:03 [IST]
Other articles published on Jun 17, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+