Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'నా దేశానికి వరల్డ్ కప్ అందించడం నా ఒక్కడివల్ల అయ్యే పనికాదు'

ఆక్లాండ్: వరల్డ్ కప్‌లో రెండు పరాజయాలు చవిచూసినంత మాత్రాన తమ ప్రతిభపై అనుమానాలు అవసరంలేదని దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డెవిలియర్స్ అన్నారు. తన దేశం కోసం మొదటి ప్రపంచ కప్‌ను గెలవడం తన ఒక్కడి వల్ల కాదని, అందుకు తన సహచర జట్టు సభ్యుల మద్దతు అవసరమని స్పష్టం చేశాడు.

ఐసీసీ వరల్డ్ కప్‌లో పూల్ బీలో భాగంగా ఆక్లాండ్‌లో దక్షిణాఫ్రికా-పాకిస్ధాన్‌కు జరిగిన మ్యాచ్‌లో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 29 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఓటమి పాలవడం ఏబీ డెవిలియర్స్‌ను నిరాశకు గురి చేసింది. ఈ ఓటమికి పూర్తి బాధ్యతను డెవిలియర్సే స్వీకరించాడు.

మ్యాచ్ అనంతరం ఏబీ డెవిలియర్స్ మాట్లాడుతూ రెండు పరాజయాలతో గ్రూప్ బీలో రెండో స్ధానంలో ఉన్నామని, భారత్, పాకిస్ధాన్‌పై ఓటమి తమ ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీయలేదని అన్నాడు. దక్షిణాఫ్రికా జట్టు వరల్డ్ కప్ సాధించడానికి అవసరమైన అన్ని అర్హతలున్నాయని డివిలియర్స్ తెలిపాడు.

I can't win this World Cup for South Africa on my own, admits AB de Villiers

వరల్డ్ కప్ సాధించే బెస్ట్ టీమ్ తమదేనని, అందులో అనుమానాలు వద్దని డివిలియర్స్ అన్నాడు. ఒత్తిడిలో సపారీలు ఓటమిపాలవుతారనేది నిజం చేశారా? అన్ని ప్రశ్నకు గాను గతంలో చాలా మ్యాచ్‌ల్లో ఒత్తిడిలో ఉండగా విజయం సాధించామని అన్నారు.

తాజా ఓటమికి కారణాలు వెతకదలచుకోలనదన్నాడు. ఈ మ్యాచ్ మాకొక మేలుకొలుపులాంటిది. కార్ రెండో గేర్ లోనే ఆగిపోయినట్లు మా ప్రదర్శన కూడా తక్కువ స్ధాయిలోనే ఆగిపోయందని అన్నాడు. ఇలాంటి ఆటతీరుతో ప్రపంచ కప్ లాంటి టోర్నమెంట్లో నెగ్గుకురాలేమని తెలిపాడు.

ఈ మ్యాచ్‌లో లోపాలను సరిదిద్దుకుని, రాబోయే మ్యాచ్‌ల్లో మళ్లీ ఐదో గేర్ వేస్తామని చెప్పాడు. దక్షిణాఫ్రికా ఇప్పటి వరకు ఒక్క వరల్డ్ కప్‌ను కూడా గెలవలేదు. తదుపరి మ్యాచ్‌ మార్చి 12న వెల్లింగ్టన్‌లో యూఏఈతో తలపడనుంది.

Story first published: Monday, November 13, 2017, 12:11 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+