
హైదరాబాద్: కెప్టెన్‌గా ఒకరికి రోల్ మోడల్‌గా ఉండేదుకు, బ్యాట్స్‌మన్‌గా భారీ స్కోర్లు చేసేందుకు విరాట్ కోహ్లీ విషయంలో ఫిట్‌నెస్ కీలకపాత్ర పోషించింది. అలాంటి క్రికెట్‌లో 90కిలోల కన్నా ఎక్కువ బరువుతో అసలు ఫిట్‌నెస్ అంటే తెలియని క్రికెటర్‌గా ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన వికెట్ కీపర్ మహమ్మద్ షెజాద్ చెప్పుకోవచ్చు.
తాజాగా ఫిట్‌నెస్ గురించి ఈ వికెట్ కీపర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మీరు కూడా కోహ్లీలాగా కాస్త తక్కువ తింటూ బరువు తగ్గొచ్చు కదా? అని ప్రశ్నకు కోహ్లీతో పోలిస్తే భారీ సిక్సర్లు కొడుతున్నా.. ఇక అతనిలాగా ఆహారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఎదురు ప్రశ్నించాడు.
గురువారం మహమ్మద్ షెజాద్ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో 'నేను ఫిట్‌నెస్‌పైనా దృష్టిసారిస్తాను.. తిండి కూడా బాగానే తింటాను. అందులో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు' అని షెజాద్ అన్నాడు. అంతేకాదు కోహ్లీలాగా ఫిట్‌నెస్ మెయింటేన్ చేయడం తన వల్ల కాదని... కానీ ప్రయత్నిస్తున్నానని చెప్పడం విశేషం.
అంతేకాదు అందరూ కోహ్లీలు కాలేరని కూడా స్పష్టం చేశాడు. పైగా బరువు తగ్గడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా డోప్ టెస్ట్‌లో ఫెయిలై మహమ్మద్ షెజాద్ ఏడాది పాటు నిషేధానికి కూడా గురయ్యాడు. టీమిండియాలో ధోనీయే తనకు క్లోజ్ ఫ్రెండ్ అని, అలాగే రైనా, ధావన్‌లతోనూ బాగానే ఎంజాయ్ చేస్తానని చెప్పుకొచ్చాడు.
బరువు ఎక్కువగా ఉన్నాడని మహమ్మద్ షెజాద్‌పై గతంలో అనేక విమర్శలు వచ్చాయి. అయినా షెజాద్ అవేమీ పట్టించుకోడు. ఆఫ్ఘన్ తరఫున అత్యధిక టీ20 పరుగులు చేసిన రికార్డు షెజాద్ పేరిటే ఉంది. వన్డేల్లో మొత్తం 50 ఓవర్లపాటు క్రీజులో ఉండే సత్తా తనకుందని, బరువు తనకెప్పుడూ సమస్య కాలేదని అన్నాడు.
జూన్‌లో బెంగళూరు వేదికగా టీమిండియాతో జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం జట్టులోని సహచర ఆటగాళ్లతో కలిసి భారత్‌లోనే ప్రాక్టీస్ చేస్తున్నాడు.