Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'పబ్‌కు వెళ్లి మందు తాగొచ్చు కానీ.. క్రికెట్ మాత్రం ఆడకూడదా?'

I can go to pub at 6 am tomorrow but I cant play cricket: Michael Vaughan criticises England Govt rules

లండన్: కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభం యావత్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూనే ఉంది. ఇప్పటికీ వైరస్‌ ప్రభావం ఏ దేశంలోనూ తగ్గకపోవడంతో.. ఇక అది తమ జీవన విధానంలో భాగంగానే ప్రజలు భావిస్తున్నారు. వైరస్‌కు వ్యాక్సిన్‌ వచ్చే వరకూ ప్రతీ పనిని వాయిదా వేయడం కష్ట సాధ్యంగా మారిన క్రమంలో ఎక్కువ శాతం మంది జాగ్రత్తులు పాటిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో అన్ని దేశాల్లో షరతులతో కూడిన అనుమతులతో హోటల్స్, మాల్స్, పబ్స్ లాంటివి ఓపెన్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఇంగ్లండ్‌లోని పబ్‌లన్నీ తెరుచుకున్నాయి.

క్రికెట్ మాత్రం ఆడకూడదు:

క్రికెట్ మాత్రం ఆడకూడదు:

ఉదయం 6 గంటల నుంచి పబ్‌లన్నీ పనిచేస్తాయని ఇంగ్లండ్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఇంగ్లండ్ ప్రభుత్వ నిర్ణయంపై ఆ దేశ మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత మైకేల్‌ వాన్‌ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'ఇక రేపు ఉదయం 6 గంటలకు నేను పబ్‌లకు వెళ్లొచ్చు. దగ్గరలోని పబ్‌కు వెళ్లి కావలసినంత మందు తాగొచ్చు. లోపల ఎంతమంది ఉన్నా పర్లేదు. కానీ క్రికెట్ మాత్రం బయట ఆడకూడదు. ఇదెక్కడి చెత్త ఆలోచనో నాకు అర్థం కావడం లేదు' అని వాన్‌ రాసుకొచ్చాడు.

విమర్శల దాడి:

విమర్శల దాడి:

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్‌ వాన్‌ చేసిన ట్వీట్‌‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే వాన్ ట్వీట్‌‌కు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు అతడిని సమర్థిస్తుంటే.. మరికొందరేమో విమర్శల దాడి చేస్తున్నారు. 'నిజమే వాన్.. ఇది సరైన నిర్ణయం కాదు' అని కొందరు అంటుంటే.. 'వేలమంది చనిపోతున్నా.. క్రికెట్ ‌గురించి ఆలోచిస్తున్నావా' అంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైకేల్‌ వాన్‌ ఇంగ్లండ్ తరఫున 82 టెస్టులు, 86 వన్డేలు, 2 టీ20లు ఆడాడు.

ఐపీఎల్, ప్రపంచకప్ రెండూ జరగాలి:

ఐపీఎల్, ప్రపంచకప్ రెండూ జరగాలి:

ఇటీవల మైకేల్‌ వాన్ మాట్లాడుతూ... ఇండియన్ ప్రీమియర్ లీగ్‌‌కు క్రికెట్‌లో ఎంత ప్రాధాన్యం ఉందో అన్ని క్రికెట్ బోర్డులకు తెలిసిందే, టీ20 ప్రపంచకప్‌‌కు ముందు ఐపీఎల్ జరిగితే.. అది ఆటగాళ్లకు మరింత ఉత్సాహం ఇస్తుందన్నారు. 'ప్రపంచకప్‌‌కు ముందు ఐపీఎల్ జరిగితే.. అది ఆటగాళ్లకు మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఐపీఎల్, ప్రపంచకప్ రెండూ జరగడం ఎంతో ముఖ్యం' అని వాన్ తెలిపాడు.

సమాచారం ఇవ్వకుండా పక్కన పెట్టడం ఏంటి?:

సమాచారం ఇవ్వకుండా పక్కన పెట్టడం ఏంటి?:

జాతీయ శిక్షణ శిబిరం కోసం గత నెలలో ప్రకటించిన 55 మంది క్రికెటర్ల జాబితాలో తన పేరు లేకపోవడంపై ఇంగ్లండ్ పేసర్ లియామ్ ప్లంకెట్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంపై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ తనకు కనీస సమాచారం ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో ప్లంకెట్‌కు‌ వాన్‌ మద్దతుగా నిలిచాడు. 'ట్రైనింగ్ జాబితాను రూపొందించే క్రమంలో ఎటువంటి వివక్ష చూపకుండా ఉండాలనే ప్రధాన సూత్రాన్ని సెలక్టర్లు మరిచారు. ఇంగ్లండ్‌ వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న ప్లంకెట్‌పై ఎందుకు అంతటి వివక్ష?. సమాచారం ఇవ్వకుండా అతన్ని పక్కన పెట్టడం అవమానించడమే. ఆలస్యంగా తెలుసుకున్న ఈ వార్త నన్ను నిరాశకు గురి చేసింది' అని వాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Story first published: Saturday, July 4, 2020, 14:14 [IST]
Other articles published on Jul 4, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+