Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వార్నర్‌ను ఎప్పుడైనా అవుట్ చేయగలను: కుల్దీప్ ధీమా

హైదరాబాద్: ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను తాను ఎప్పడు కావాలనుకుంటే అప్పుడు అవుట్ చేయగలనని టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ అన్నాడు. గురువారం రెండో వన్డే జరగనున్న నేపథ్యంలో కుల్దీప్ మీడియాతో మాట్లాడాడు. తన బౌలింగ్‌లో వార్నర్ ఒత్తిడికి లోనవుతున్నాడని అందుకే సులభంగా అవుట్ చేయగలుగుతున్నానని చెప్పాడు.

ఒత్తిడి లేకపోవడం సంతోషంగా ఉంది

ఒత్తిడి లేకపోవడం సంతోషంగా ఉంది

'నాపై ఒత్తిడి లేకపోవడం సంతోషంగా ఉంది. వార్నర్‌కు బౌలింగ్‌ చేయడాన్ని ఎప్పుడైనా ఆస్వాదిస్తా. నా ప్లాన్స్ సక్రమంగా అమలైతే అతడిని ఎప్పుడైనా అవుట్‌ చేయగలను. వార్నర్‌ను ఇంకా ఎక్కువ సార్లు అవుట్‌ చేసేందుకు ప్రయత్నిస్తా. బ్యాట్స్‌మన్‌పై బౌలర్‌దే పైచేయి అయితే వార్నర్‌ను పెవిలియన్‌ పంపిస్తా' అని కుల్దీప్ అన్నాడు.

స్మిత్‌ మాత్రం బౌలర్‌ను చక్కగా అంచనా వేయగలడు

స్మిత్‌ మాత్రం బౌలర్‌ను చక్కగా అంచనా వేయగలడు

'ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ మాత్రం బౌలర్‌ను చక్కగా అంచనా వేయగలడు. లెగ్‌స్టంప్‌ ప్రాంతంలో బ్యాటింగ్‌ చేసి సింగిల్స్‌ తీస్తాడు. స్పిన్నర్లు రెండు మూడు రకాలుగా బౌలింగ్‌ చేస్తారు. అదే మణికట్టు స్పిన్నర్లైతే మరింత వైవిధ్యంగా బంతులు విసురుతారు' అని కుల్దీప్ పేర్కొన్నాడు.

భారత జట్టులో ఇద్దరు మణికట్టు స్పిన్నర్లు

భారత జట్టులో ఇద్దరు మణికట్టు స్పిన్నర్లు

భారత జట్టులో ఇద్దరు మణికట్టు స్పిన్నర్లు (చాహల్‌, కుల్‌దీప్‌) ఒకేసారి ఆడుతుంటడం తనకు చాలా నచ్చిందని చెప్పిన కుల్దీప్... జూనియర్‌, రంజీ స్థాయిల్లో మాత్రం తనకు ఇది కుదరలేదని తెలిపాడు. ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ధర్మశాలలో జరిగిన టెస్టులో కుల్దీప్ అరంగేట్రం చేశాడు.

రెండో వన్డేకి వర్షం ముప్పు

రెండో వన్డేకి వర్షం ముప్పు

ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా చెన్నైలో జరిగిన తొలి వన్డేలో వార్నర్‌ను కుల్దీప్‌ పెవిలియన్‌ పంపించిన సంగతి తెలిసిందే. గురువారం ఇరు జట్ల మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రెండో వన్డే జరగనుంది. రెండో వన్డేకి వర్షం ముప్పు పొంచి ఉంది. పిచ్‌ను ఇంకా కవర్లతో కప్పే ఉంచారు. 'అల్పపీడన ప్రభావం లేదు. గురువారం వర్షం కురిసే అవకాశముంది. కానీ మధ్యాహ్నం కల్లా ఎండ కాస్తుంది' అని ఐఎండీ డైరెక్టర్‌ గణేశ్‌ దాస్‌ చెప్పాడు.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+