న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బెట్‌ కడుతున్నా.. ధోనీ రికార్డును ఎవరూ బ్రేక్‌ చేయలేరు: గంభీర్‌

I can bet: Gautam Gambhir names one MS Dhoni record that is going to stay forever

న్యూఢిల్లీ: టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డును ఏ ఒక్కరు బద్దలు కొట్టలేరని మాజీ భారత ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ బెట్‌ కట్టారు. క్రికెట్ ఆటలో ఎందరు కెప్టెన్లు వచ్చినా.. ఐసీసీ టోర్నీలన్నీ గెలిచిన ఘనతను ఎవరూ చెరపలేరని ధీమా వ్యక్తం చేశారు. ఈ రికార్డు ఎప్పటికీ ధోనీ పేరుతోనే నిలిచి ఉంటుందన్నారు. ఎంఎస్ ‌ధోనీ శనివారం క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. గౌతీ భారత్ తరఫున 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20 మ్యాచ్‌లు ఆడారు.

భారత స్టార్ మహిళా బాక్సర్‌కు కరోనా!!భారత స్టార్ మహిళా బాక్సర్‌కు కరోనా!!

ధోనీ రికార్డును ఎవరూ బ్రేక్‌ చేయలేరు:

ధోనీ రికార్డును ఎవరూ బ్రేక్‌ చేయలేరు:

స్టార్‌స్పోర్ట్స్‌ షో 'క్రికెట్‌ కనెక్టెడ్‌'లో గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ... 'ఎంఎస్‌ ధోనీ మూడు ఐసీసీ ట్రోఫీల రికార్డు ఎప్పటికీ అలానే ఉంటుంది. మరే కెప్టెన్‌ ఈ ఘనతను సాధిస్తారనుకోను. దీనిమీద నేను బెట్‌ కడుతున్నా. 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌, 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలవడం సాధారణ విషయం కాదు. సెంచరీలు ఎప్పటికైనా బద్దలవుతాయి. ఎవరో వచ్చి రోహిత్‌ శర్మ కన్నా ఎక్కువ ద్విశతకాలు కొట్టొచ్చు. భారత్‌ నుంచి మరే కెప్టెన్‌ మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిస్తాడనుకోను. ఎప్పటికీ మహీ పేరుతోనే ఆ రికార్డు ఉంటుంది' అని అన్నారు.

వైరస్‌ కారణంగా:

వైరస్‌ కారణంగా:

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ సెమీస్‌ తర్వాత ఎంఎస్ ధోనీ మైదానంలో అడుగుపెట్టలేదు. మహీ వీడ్కోలుపై ఎన్నో వదంతులు వచ్చాయి. వాటికి ధోనీ సతీమణి సాక్షి, టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి, బీసీసీఐ మాజీ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ వివరణ ఇచ్చారు. ఐపీఎల్ 2020లో సత్తాచాటితే టీమిండియాలోకి నేరుగా వస్తాడని కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా స్పష్టం చేశాడు. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడనప్పటికీ.. ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌లో ఆడతాడని అభిమానులు ఆశించారు.కానీ వైరస్‌ కారణంగా ఆ టోర్నీ వాయిదా పడింది. ఐపీఎల్‌ సైతం మార్చిలో కాకుండా సెప్టెంబర్‌లో యూఏఈలో ఆరంభం అవుతోంది. దీంతో మహీ వీడ్కోలు పలికాడు.

ఆల్ టైమ్ రన్ స్కోరర్స్ జాబితాలో ఐదో స్థానం:

ఆల్ టైమ్ రన్ స్కోరర్స్ జాబితాలో ఐదో స్థానం:

సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ తర్వాత 10,733 పరుగులు సాధించిన ఆటగాడిగా ఎంఎస్ ధోనీ వన్డేల్లో భారత ఆల్ టైమ్ రన్ స్కోరర్స్ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో ధోనీ 90 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో 4,876 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 33 అర్ధ శతకాలు ఉన్నాయి. 350 వన్డే మ్యాచ్‌ల్లో 10,773 రన్స్‌ చేశాడు. వీటిల్లో 10 శతకాలలతో పాటు 73 అర్థ శతకాలు ఉన్నాయి. వ్యక్తిగత అత్యధిక స్కోర్ 183‌. ఇక 98 టీ20 మ్యాచ్‌లలో 1,600 పరుగుల బాదాడు.

Story first published: Tuesday, August 18, 2020, 10:17 [IST]
Other articles published on Aug 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X