Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 : సన్‌రైజర్స్ కెప్టెన్ ఒక మెషీన్.. మనసులో మాట చెప్పిన స్టార్ ఓపెనర్!

 I Call SRH Captain Aiden Markram A Machine says Mayank Agarwal

ఈ ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కొత్త శకంలో అడుగు పెడుతోంది. తాజాగా సౌతాఫ్రికా జట్టు పగ్గాలు అందుకున్న ఎయిడెన్ మార్క్రమ్ కెప్టెన్సీలో సన్‌రైజర్స్ ఆడనుంది. ఈసారి ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ సక్సెస్‌కు మార్క్రమ్ చాలా ముఖ్యం. అతనితోపాటు కర్ణాటక బ్యాటర్ మయాంక్ అగర్వాల్ కూడా సన్‌రైజర్స్‌కు కీలకం కానున్నాడు. ఈ నేపథ్యంలో తమ కెప్టెన్‌ ఎలాంటి వాడో మయాంక్ అగర్వాల్ చెప్పుకొచ్చాడు. అతనితో కొంత సమయం గడిపిన తర్వాత మనసులో మాటను మయాంక్ బయట పెట్టాడు.

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ కెప్టెన్‌గా మార్క్రమ్ అదరగొట్టాడు. ఆల్‌రౌండర్‌గా ఆకట్టుకోవడంతోపాటు కెప్టెన్సీలోనూ తన మార్క్ చూపించాడు. ఈ క్రమంలోనే మొట్టమొదటి సౌతాఫ్రికా టీ20 లీగ్ ట్రోఫీ కూడా అందుకున్నాడు. ఇది చూసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం.. ఐపీఎల్ జట్టును కూడా మార్క్రమ్ చేతుల్లో పెట్టింది. ఇక్కడ కూడా అతను అలాంటి సక్సెస్ అందిస్తాడని ఆశిస్తోంది. సౌతాఫ్రికా సెలెక్టర్లు కూడా మార్క్రమ్‌పై నమ్మకం ఉంచి, అతన్ని ఆ దేశ జట్టుకు కెప్టెన్ చేశారు.

ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొన్న తర్వాత మయాంక్ అగర్వాల్ తన అభిప్రాయం చెప్పాడు. మార్క్రమ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. 'తనో గొప్ప వ్యక్తి. ఫెంటాస్టిక్ క్రికెటర్. మార్క్రమ్‌ను నేను మెషీన్ అని పిలుస్తా. ఎందుకంటే.. అతను తన ఆటపై చాలా అంటే చాలా కష్టపడతాడు. దాని గురించే ఎక్కువ ఆలోచిస్తుంటాడు. సంతోషంగా, రిలాక్స్‌డ్‌గా ఉండే వాతావరణం ఉంటుందని దగ్గర' అని మయాంక్ చెప్పుకొచ్చాడు. వీళ్లిద్దరూ కనుక చక్కగా రాణిస్తే మరో ఐపీఎల్ ట్రోఫీ నెగ్గే ఛాన్స్ సన్‌రైజర్స్‌కు ఉంటుంది.

గడిచిన మూడేళ్లలో సన్‌రైజర్స్ యాజమాన్యం జట్టులో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే మూడేళ్లలో ఆ జట్టుకు నాయకత్వం వహించిన మూడో కెప్టెన్ మార్క్రమ్. దీనిపై నిపుణుల నుంచే కాదు, అభిమానుల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. అయితే తను మాత్రం మార్క్రమ్ కెప్టెన్సీలో ఆడేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని మయాంక్ అన్నాడు. 'నేను పంజాబ్‌కు ఆడినప్పుడు మా మధ్య ఒక బంధం ఉండేది. ఇక్కడ సన్‌రైజర్స్‌లో కూడా అదే బంధం ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తున్నా' అని పేర్కొన్నాడు.

Story first published: Thursday, March 30, 2023, 13:46 [IST]
Other articles published on Mar 30, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+