Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాజస్ధాన్‌కు ఐదో విజయం, నేను చాలా బంతులు తిన్నా: ధోని (ఫోటోలు)

అహ్మాదాబాద్: ఐపీఎల్‌లో రాజస్ధాన్ రాయల్స్ వరుసగా ఐదవ విజయాన్ని నమోదు చేసింది. రాజస్ధాన్ విజయ పరంపరను ధోని సేన అడ్డుకట్ట వేయడంలో విఫలమైంది. దీంతో అహ్మాదాబాద్‌లోని సర్ధార్ పటేల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ Vs రాజస్ధాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నైపై రాజస్ధాన్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఐపీఎల్‌లో 15వ మ్యాచ్‌ అయిన ఇందులో రాజస్ధాన్ రాయల్స్ ఓపెనర్లు 157 పరుగుల విజయలక్ష్యాన్ని అలవోకగా చేధించారు. ముఖ్యంగా రాజస్ధాన్ రాయల్స్ ఓపెనర్లు షేన్ వాట్సన్, అజ్యంకే రహాన్ ఏ మాత్రం తడబడకుండా తొలి వికెట్‌కు 144 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.

ఈ మ్యాచ్‌లో కెప్టెన్ షేన్ వాట్సన్ 47 బంతుల్లో 73 పరుగులు, రహానే 55 బంతుల్లో 76 నాటౌట్‌గా నిలిచారు. వీరిద్దరి భాగస్వామ్యం చెన్నైపై రాజస్ధాన్ జట్టు అలవోకగా విజయం సాధించడంలో దోహదపడటంతో పాటు, ఈ ఐపీఎల్‌లో రాజస్ధాన్ జట్టు వరుసగా ఐదవ విజయాన్ని కైవసం చేసుకుంది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్‌కింగ్స్ మొదటి నుంచి ఇన్నింగ్స్‌ను పేలవంగా ఆరంభించింది. మెక్ కల్లమ్ 12, డుప్లెసిస్ 1, రైనా 4 పరుగులకే పెవిలియన్‌కు చేరడంతో పదో ఓవర్లో స్మిత్ ఔటయ్యే సరికే చెన్నై స్కోరు 65 పరుగలు.

ఆ సమయంలో బ్యాటింగ్‌కు దిగిన బ్రావో, ధోని జట్టనుని ఆదుకున్నారు. బ్రావో ఎడాపెడ్ బౌండరీలు బాదుతుంటే, పొట్టి క్రికెట్‌లో మంచి పేరున్న ధోని మాత్రం అవసరమైనంత ధాటిగా ఆడలేకపోయాడు. టైమింగ్‌తో ఇబ్బంది పడటంతో పాటు, పరుగుల కోసం చాలా శ్రమించాల్సి వచ్చింది. ఐదో వికెట్‌కు ధోని-బ్రావో జోడి 91 పరుగులు చేయడం గమనార్హం.

మ్యాచ్ అనంతరం కెప్టెన్ ధోని మాట్లాడుతూ 'ఆరంభం బాగున్నా, ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ఆడాం' అని అన్నారు. 'ఈరోజు మాకు ఎంత మాత్రం అనుకూలించని రోజు' అంటూ ధోని తెలిపారు. వరుసగా మూడు మ్యాచ్ ల్లో విజయ పరంపర కొనసాగిస్తున్న ధోని సేనకు రాజస్ధాన్ రాయల్స్ బ్రేక్ వేసింది.

 చెన్నైపై రాజస్ధాన్ విజయం

చెన్నైపై రాజస్ధాన్ విజయం

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్‌కింగ్స్ మొదటి నుంచి ఇన్నింగ్స్‌ను పేలవంగా ఆరంభించింది. మెక్ కల్లమ్ 12, డుప్లెసిస్ 1, రైనా 4 పరుగులకే పెవిలియన్‌కు చేరడంతో పదో ఓవర్లో స్మిత్ ఔటయ్యే సరికే చెన్నై స్కోరు 65 పరుగలు.

 చెన్నైపై రాజస్ధాన్ విజయం

చెన్నైపై రాజస్ధాన్ విజయం

ఆ సమయంలో బ్యాటింగ్‌కు దిగిన బ్రావో, ధోని జట్టనుని ఆదుకున్నారు. బ్రావో ఎడాపెడ్ బౌండరీలు బాదుతుంటే, పొట్టి క్రికెట్‌లో మంచి పేరున్న ధోని మాత్రం అవసరమైనంత ధాటిగా ఆడలేకపోయాడు.

 చెన్నైపై రాజస్ధాన్ విజయం

చెన్నైపై రాజస్ధాన్ విజయం

టైమింగ్‌తో ఇబ్బంది పడటంతో పాటు, పరుగుల కోసం చాలా శ్రమించాల్సి వచ్చింది. ఐదో వికెట్‌కు ధోని-బ్రావో జోడి 91 పరుగులు చేయడం గమనార్హం.

 చెన్నైపై రాజస్ధాన్ విజయం

చెన్నైపై రాజస్ధాన్ విజయం

ధోనీ సేన నిర్దేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు రహానె (76 నాటౌట్‌), వాట్సన్‌ (73) తొలి వికెట్‌కు శతక భాగస్వామ్యం నమోదు చేయడంతో మరో 10 బంతులు మిగిలుండగానే రాజస్థాన్‌ గెలుపొందింది.

 చెన్నైపై రాజస్ధాన్ విజయం

చెన్నైపై రాజస్ధాన్ విజయం

ఐపీఎల్‌లో రాజస్ధాన్ రాయల్స్ వరుసగా ఐదవ విజయాన్ని నమోదు చేసింది. రాజస్ధాన్ విజయ పరంపరను ధోని సేన అడ్డుకట్ట వేయడంలో విఫలమైంది. దీంతో అహ్మాదాబాద్‌లోని సర్ధార్ పటేల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ Vs రాజస్ధాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నైపై రాజస్ధాన్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.

 చెన్నైపై రాజస్ధాన్ విజయం

చెన్నైపై రాజస్ధాన్ విజయం

ఐపీఎల్‌లో 15వ మ్యాచ్‌ అయిన ఇందులో రాజస్ధాన్ రాయల్స్ ఓపెనర్లు 157 పరుగుల విజయలక్ష్యాన్ని అలవోకగా చేధించారు. ముఖ్యంగా రాజస్ధాన్ రాయల్స్ ఓపెనర్లు షేన్ వాట్సన్, అజ్యంకే రహాన్ ఏ మాత్రం తడబడకుండా తొలి వికెట్‌కు 144 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.

 చెన్నైపై రాజస్ధాన్ విజయం

చెన్నైపై రాజస్ధాన్ విజయం

అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న చెన్నై, రాజస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ ఏకపక్షంగా ముగిసింది. చెన్నై బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేయడానికి ఇబ్బంది పడిన మొతేరా పిచ్‌పైనే రాజస్థాన్‌ ఓపెనర్లు బౌండ్రీల మోతెక్కించారు. రహానె, వాట్సన్‌ పోటీపడి మరీ పరుగులు సాధించి రాజస్థాన్‌కు వరుసగా ఐదో విజయాన్నందించారు.

 చెన్నైపై రాజస్ధాన్ విజయం

చెన్నైపై రాజస్ధాన్ విజయం

అహ్మాదాబాద్‌లోని సర్ధార్ పటేల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ Vs రాజస్ధాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఛీర్ లీడర్స్ విన్యాసాలు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+