'నా ఆలోచనలు, గంగూలీ ఆలోచనలు ఒకటే'

హైదరాబాద్: ఆట విషయంలో తన ఆలోచనలు, గంగూలీ ఆలోచనలు ఒకటేనని, ఇద్దరం కలిసి పనిచేస్తున్నామని ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2019 సీజన్‌లో రికీ పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా పని చేస్తుండగా... సౌరవ్ గంగూలీని ఢిల్లీ యాజమాన్యం సలహాదారుగా నియమించుకున్న సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఢిల్లీకి టైటిల్ అందించాలని
దీంతో వీరిద్దరూ కలిసి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు తొలి టైటిల్ అందించాలని సమిష్టిగా కృషి చేస్తున్నారు. టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఈ నేపథ్యంలో గురువారం ఢిల్లీ జట్టు ప్రాక్టీస్ సమయంలో అక్కడే ఉన్న గంగూలీ వారికి విలువైన సలహాలిచ్చాడు.

పాంటింగ్‌తో చాలాసేపు మాట్లాడిన గంగూలీ
గురువారం ఢిల్లీ జట్టు జెర్సీ వేసుకున్న గంగూలీ ఈడెన్ గార్డెన్స్ పిచ్‌ను పరిశీలించాడు. ఆ తర్వాత డిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌తో చాలాసేపు మాట్లాడాడు. అనంతరం నిర్వహించిన మీడియో సమావేశంలో రికీ పాంటింగ్ మాట్లాడుతూ ఢిల్లీ జట్టు డగౌట్‌లో సౌరవ్ గంగూలీ కూర్చుంటానని చెప్పాడు. ఢిల్లీ క్యాపిటల్స్ గట్టి పోటీనివ్వగలదనే ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశాడు.

గంగూలీతో కలిసి పనిచేయడమంటే నాకెంతో ఇష్టం
"గంగూలీతో కలిసి పనిచేయడమంటే నాకెంతో ఇష్టం. గంగూలీ సైతం ఢిల్లీ క్యాపిటల్స్ గెలుస్తుందని బాగా కుతూహలంగా ఉన్నాడు. ఈ సీజన్‌ను బాగానే ఆరంభించాం. ఇంకా మంచి క్రికెట్ ఆడి కొన్ని వారాల్లో గట్టి మార్పులు చూపిస్తాం. ఆట విషయంలో తన ఆలోచనలు, గంగూలీ ఆలోచనలు ఒకటేనని, ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం" అని పాంటింగ్ చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications