Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తన బ్యాటింగ్‌ విజయ రహస్యమేంటో చెప్పిన విరాట్ కోహ్లీ!!

I analyse everything about a bowler: Virat Kohli on how he gets ready to face the ball

ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫార్మాట్ ఏదైనా, బౌలర్ ఎవరైనా.. కోహ్లీ క్రీజులో ఉన్నాడంటే పరుగుల వరద పారాల్సిందే. అతని బ్యాటింగ్‌ విన్యాసాలతో భారత జెండా రెపరెపలాడిన క్షణాలు ఎన్నో ఉన్నాయి. తన కెరీర్‌లో టీమిండియాకు అందించిన విజయాలను చూస్తే.. అతను గెలవడానికే పుట్టాడని, గెలిపించడానికే జట్టులో ఉన్నాడని, గెలిపిస్తూనే ఉంటాడని అనిపించక మానదు. అయితే మైదానంలో పరుగుల వరద పారిస్తున్న విరాట్ బ్యాటింగ్‌ రహస్యమేంటో మీకు తెలుసా?.

బౌలర్ గురించి ప్రతిదీ విశ్లేషిస్తా:

బౌలర్ గురించి ప్రతిదీ విశ్లేషిస్తా:

ప్రతి బాల్‌ను ఎదుర్కొనేముందు విరాట్ కోహ్లీ బౌలర్‌ గురించి ప్రతిదీ విశ్లేషిస్తాడట. ఈ విషయాన్ని భారత కెప్టెన్ 'ఓపెన్ నెట్స్ విత్ మయాంక్' తాజా ఎపిసోడ్‌లో వెల్లడించాడు. 'నేను బౌలర్ గురించి ప్రతిదీ క్షుణ్ణంగా విశ్లేషిస్తాను. అది ఏ బౌలర్ అయినా ఇదే ఫాలో అవుతా. స్పెషల్‌ డెలివరీ వేసేముందు బౌలర్ బాడీ లాంగ్వేజ్ ఏంటో పసిగడతా. బౌలర్‌ రన్అప్, మణికట్టును చూసి అతడు ఎలాంటి బాల్‌ వేయబోతున్నాడో తెలుసుకుంటా' అని విరాట్‌ కొహ్లీ వివరించాడు. అంతర్జాతీయ కెరీర్‌లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 86 టెస్టుల్లో, 248 వన్డేల్లో, 82 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

ఔట్‌ కావొద్దంటూ ఆడితే:

ఔట్‌ కావొద్దంటూ ఆడితే:

'మనం ఊహించినచోటే బౌలర్‌ బాల్‌ వేస్తే.. మనం దాన్ని బౌండరీ బాదితే అప్పుడు అద్భుతమైన ఫీలింగ్‌ కలుగుతుంది. అలాకాకుండా ఎప్పుడూ ఔట్‌ కావొద్దంటూ ఆడితే.. మనలో భయం పెరిగిపోతుంది. మనముందు పడ్డ బాల్‌ను అద్భుతంగా ఎలా ఆడాలి అని ఆలోచిస్తేనే.. భయం పోతుంది. నేను ఇలానే ఆడుతాను. అద్భుత ఫలితాలు వస్తున్నాయి' విరాట్ కొహ్లీ చెప్పాడు. విరాట్ ప్రస్తుతం మూడు ఫార్మాట్లలోనూ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌. విరాట్ బ్యాటింగ్‌పై ఎందరో మాజీలు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.

70 సెంచరీలు:

70 సెంచరీలు:

2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 86 టెస్టులాడి 53.63 సగటుతో 7,240 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 248 వన్డేల్లో 59.34 సగటుతో 11,867 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 58 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 81 టీ20లలో 50.8 సగటుతో 2,794 పరుగులు చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 21,901 పరుగులు చేశాడు.

త్వరలో ప్రాక్టీస్:

త్వరలో ప్రాక్టీస్:

కరోనా వైరస్ కారణంగా నాలుగు నెలలుగా ఇంట్లోనే ఉంటున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. అతని భార్య అనుష్క శర్మతో ఆనందంగా గడుపుతున్నాడు. ఇంటికే పరిమితమైన వీరిద్దరూ తమ ఆనంద క్షణాలను అభిమానులతో ఎప్పటికప్పుడు సోషల్ ‌మీడియాలో పంచుకుంటున్నారు. ఇద్దరు కలిసి వంట చేస్తున్న వీడియోలు, సరదాగా గడిపే ఫొటోలను సోషల్‌ మీడియాలో ఇప్పటికే పోస్టు చేశారు. ఇక యూఏఈలో ఐపీఎల్ 2020 జరగనున్న నేపథ్యంలో.. విరాట్ త్వరలో మైదానంలో ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నాడు. ఐపీఎల్ కంటే ముందే.. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగే అవకాశం ఉంది.

Story first published: Tuesday, July 28, 2020, 20:58 [IST]
Other articles published on Jul 28, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+