'గౌరవంగా భావిస్తున్నా, ఆ క్రికెటర్ పాత్ర సవాల్‌తో కూడుకున్న విషయం'

హైదరాబాద్: శ్రీలంక స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ పాత్రలో నటించడాన్ని చాలా గౌరవంగా భావిస్తున్నానని తమిళ నటుడు విజయ్ సేతుపతి పేర్కొన్నాడు. డార్ మోషన్ ఫిక్చర్స్ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథని బయోపిక్‌గా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్‌కు శ్రీపతి రంగస్వామి దర్శకత్వం వహించనున్నారు.
ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి
ఈ సినిమాపై గురువారం అధికారిక ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ "మురళీధరన్ పాత్రలో నటించడం కెరీర్‌లోనే ఓ గొప్ప విషయం. చాలా గౌరవంగా భావిస్తున్నా. వాస్తవానికి ఆయన పాత్ర పోషించడం సవాలుతో కూడుకున్న విషయం" అని అన్నాడు.

మురళీధరన్ మాట్లాడుతూ
ముత్తయ్య మురళీధరన్ మాట్లాడుతూ "నా బయోపిక్ తెరపైకి రానుందనే విషయం వింటేనే చాలా సంతోషంగా ఉంది. 2020లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విజయ్ సేతుపతి వంటి మంచి నటుడు నా పాత్ర పోషించడం మరింత గౌరవంగా ఉంది" అని తెలిపాడు.

సంతోషంగా ఉంది
ఇక, సినిమా నిర్మాతలు మాట్లాడుతూ క్రికెట్ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ముత్తయ్య మురళీధరన్ బయో పిక్‌ను సినిమాగా తెరకెక్కించడం సంతోషంగా ఉందని అన్నారు. "డిసెంబర్, 2019 నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదొక పెద్ద బడ్జెట్ సినిమా, ఈ సినిమా మొత్తాన్ని భారత్‌లోనే చిత్రీకరించారు. శ్రీలంక, ఇంగ్లాండ్‌లలో సైతం కొంత సినిమాను తీస్తాం" అని అన్నారు.

1972లో కాండీలో జన్మించిన ముత్తయ్య
1972లో కాండీలో జన్మించిన ముత్తయ్య మురళీ ధరన్ 1992 నుంచి 2011 మధ్య కాలంలో శ్రీలంక జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. తన బౌలింగ్ యాక్షన్‌తో క్రికెట్‌లో ఎన్నో అద్భుతమైన రికార్డులను తన పేరిట లిఖించాడు. 1996లో శ్రీలంక జట్టు ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడంలో ముత్తయ్యదే కీలకపాత్ర.

800 వికెట్లతో అగ్రస్థానంలో ముత్తయ్య
133 టెస్టులాడి అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో ముత్తయ్య మురళీధరన్(800) అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. 350 వన్డేల్లో 534 వికెట్లు, 12 టీ20ల్లో 13 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా చూస్తే మూడు ఫార్మాట్లు చూస్తే ముత్తయ్య మురళీ ధరన్ 1,247 వికెట్లు పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications