భయపడుతున్నా: పాండ్యకు బౌలింగ్ చేయడంపై మలింగ!!

ప్రపంచకప్‌లో భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు బౌలింగ్ చేయడానికి బయపడున్నా అని ముంబై ఇండియన్స్ పేసర్ లసిత్ మలింగ పేర్కొన్నారు. వాంఖడే మైదానం వేదికగా సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. 172 పరుగుల లక్ష్యంతో దిగిన ముంబయి ఇండియన్స్ విజయానికి చివరి 12 బంతులలో 22 పరుగులు కావాలి.
క్రీజులో ముంబయి హిట్టర్ బ్యాట్స్‌మన్‌లు హార్దిక్ పాండ్య, కీరన్ పొలార్డ్ ఉన్నారు. 19వ ఓవర్ వేసిన స్పిన్నర్ పవన్ నెగికి హార్దిక్ పాండ్య చుక్కలు చూపించాడు. ఆ ఓవర్‌లో చెలరేగి ఆడిన పాండ్య.. ఏకంగా 22 పరుగులు చేసి ముంబై జట్టుకి అద్భుత విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో పాండ్య 37 నాటౌట్ (16 బంతుల్లో 5పోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేసాడు.
మ్యాచ్ అనంతరం ముంబై పేసర్ లసిత్ మలింగ మాట్లాడుతూ... 'ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్యకు బౌలింగ్ చేయడానికి బయపడున్నా. ప్రస్తుతం పాండ్య మంచి ఫామ్ లో ఉన్నాడు.. నేను ప్రపంచకప్‌లో అతనికి బౌలింగ్ చేయాల్సి వస్తదేమో అని భయపడుతున్నా' అని మలింగ తెలిపారు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పాండ్య ఆటను ప్రశంసించాడు. 'ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్య నిరూపించుకున్నాడు. హార్దిక్ హిట్టింగ్ జట్టుకి ఎంతగానో ఉపయోగపడుతోంది. కీలక సమయంలో పాండ్య లాంటి ఆటగాళ్లు జట్టుకు అవసరం' అని రోహిత్ చెప్పుకొచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications