ముస్లిం అయివుండి భారత్ తరఫున ఎందుకు ఆడుతున్నావ్: పఠాన్‌ను ప్రశ్నించిన పాక్ బాలిక
హైదరాబాద్: భారత జట్టులో తిరిగి చొటు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్న ఆటగాళ్లలో పేసర్ ఇర్ఫాన్ పఠాన్ ఒకరు. గతంలో తనకు ఎదురైన ఓ వింత అనుభవం గురించి తాజాగా నాగ్‌పూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చి మీడియాకు వివరించారు.
అప్పట్లో తాను టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్న రోజుల్లో తాను లాహోర్‌లో ఓ కార్యక్రమానికి హాజరయ్యాను. అప్పుడు ఓ బాలిక తన వద్దకు వచ్చి "ఓ ముస్లిం అయివుండి ఇండియా తరఫున ఎందుకు క్రికెట్ ఆడుతున్నావు?" అని ప్రశ్నించిందని చెప్పాడు.
ఆపై తాను సమాధానం ఇస్తూ "ఇండియా తరఫున ఆడటం నాకెంతో గర్వకారణమని చెప్పాను. ఆ ఘటన నాకు ఇప్పటికీ ప్రేరణగా నిలుస్తుంది. నేను గర్వపడే సందర్భాలు ఇంకా ఉన్నాయి. తొలి మ్యాచ్ ఆడేవేళ, కెప్టెన్ సౌరవ్ గంగూలీ, నాకు టోపీని ఇవ్వడం నా జీవితంలో అత్యంత మధురమైన సమయం" అని పఠాన్ అన్నాడు.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో 2003లో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన ఇర్ఫాన్ పఠాన్ ఇప్పటి వరకు భారత్ తరుపున 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 1800 పరుగులతో పాటు 301 వికెట్లు తీసుకున్నాడు. 2006లో పాక్‌పై జరిగిన మ్యాచ్‌లో పఠాన్ హ్యాట్రిక్ వికెట్లు తీసుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications