వీడ్కోలు మ్యాచ్ ఏర్పాటు చేయమని ఎవర్నీ అడగలేదు: నెహ్రా
హైదరాబాద్: 'నేను సెలక్టర్ల అనుమతితో క్రికెట్ ఆడటం ప్రారంభించలేదు. అటువంటప్పుడు సెలక్టర్ల అనుమతితో వీడ్కోలు ఎందుకు చెబుతాను' రిటైర్మెంట్ తర్వాత ఆశిష్ నెహ్రా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఓ ప్రశ్నకు చెప్పిన సమాధానం. న్యూజిలాండ్‌తో తన సొంత మైదానం ఫిరోజ్ షా కోట్లాలో బుధవారం జరిగిన తొలి టీ20లో అంతర్జాతీయ క్రికెట్‌కు నెహ్రా వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
మ్యాచ్ అనంతరం ఆశిష్ నెహ్రా మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా నెహ్రాకి ఊహించని ప్రశ్న ఎదురైంది. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు సెలక్టర్ల నిర్ణయాన్ని ముందుగానే తీసుకుని వీడ్కోలు పలికారా? అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు నెహ్రా ఘాటుగా స్పందించాడు.

సెలక్టర్ల అనుమతితో క్రికెట్ ఆడటం ప్రారంభించలేదు
'నేను సెలక్టర్ల అనుమతితో క్రికెట్ ఆడటం ప్రారంభించలేదు. అటువంటప్పుడు సెలక్టర్ల అనుమతితో వీడ్కోలు ఎందుకు చెబుతాను. మరి ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అలా వ్యాఖ్యానించినట్లు నాకు తెలియదు. ఆ విషయాన్ని నాకైతే ఎమ్మెస్కే చెప్పలేదు. మీరు మాత్రమే నన్ను ఆ ప్రశ్న అడుగుతున్నారు' అని నెహ్రా అన్నాడు.

జట్టు మేనేజ్ మెంట్‌తో మాత్రమే చర్చించాను
'నా వీడ్కోలుపై నేను కేవలం జట్టు మేనేజ్ మెంట్‌తో మాత్రమే చర్చించాను. ఇటీవల ముగిసిన ఆసీస్‌తో సిరీస్‌లో భాగంగా నేను రాంచీకి వచ్చినప్పుడు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి నా ప్లాన్ చెప్పా. అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలకాలని అనుకుంటున్నట్లు కోహ్లీతో స్పష్టం చేశా. దీనికి కోహ్లీ ఆశ్చర్యపోయాడు' అని నెహ్రా తెలిపాడు.

ఐపీఎల్లో ఆటగాడిగా కోచ్‌గా ఉంటూ కెరీర్‌ను కొనసాగించవచ్చు కదా
'కోచ్‌గా ప్లేయర్‌గా ఐపీఎల్లో ఆడే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు క్రికెట్ నుంచి మొత్తంగా గుడ్ బై చెప్పడమని కోహ్లీ నన్ను అడిగాడు. ఐపీఎల్లో ఆటగాడిగా కోచ్‌గా ఉంటూ కెరీర్‌ను కొనసాగించవచ్చు కదా అన్నాడు. నేను మొత్తంగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు కోహ్లీకి తెలిపా. ఇది మాత్రమే జరిగింది' అని నెహ్రా స్పష్టం చేశాడు.

నా వీడ్కోలు గురించి ఎన్నిసార్లు అడిగినా ఇదే చెబుతా
'నా వీడ్కోలు గురించి ఎన్నిసార్లు అడిగినా ఇదే చెబుతా. అది కివీస్‌తో సిరీస్‌కు ఢిల్లీ మ్యాచ్ ద్వారా కుదిరింది. అంతేకానీ నాకు వీడ్కోలు మ్యాచ్ ఏర్పాటు చేయమని ఎవర్నీ అడగలేదు. నేను సెలక్టర్ల అనుమతితో ఫేర్‌వెల్ మ్యాచ్‌ను ఏర్పాటు చేయించుకోలేదు. నేను తీసుకునే నిర్ణయంలో కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి, జట్టు మేనేజ్ మెంట్ పాత్ర మాత్రమే ఉంది. సెలక్టర్ల పాత్ర ఇక్కడ ఎంతమాత్రం లేదు' అని నెహ్రా పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications