నేనా రాజకీయాల్లోకా!: వదంతులను నమ్మొద్దన్న భజ్జీ
హైదరాబాద్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వస్తున్న వార్తలపై టీమిండియా వెటరన్ స్ఫిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. సమీప భవిష్యత్తులో తనకు రాజకీయాల్లో చేరే ఉద్దేశం లేదని హర్భజన్ స్పష్టం చేశాడు.

భజ్జీ కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ వచ్చిన వదంతులపై ట్విట్టర్ వేదికగా తోసిపుచ్చాడు. ' రాబోయే రోజుల్లో నాకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం నాకు లేదు. వదంతులు వ్యాప్తి చేయడాన్ని దయచేసి మానుకోండి' అంటూ భజ్జీ ట్విట్టర్‌లో కోరారు. 2017లో పంబాబ్ అసెంబ్లీకి జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జలంధర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు అందులో పేర్కొన్నారు.
మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ త్వరలో కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారని ఇందులో భాగంగా సిద్ధూ మంగళవారం (డిసెంబర్ 20)న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసినట్లు వార్తలు వచ్చాయి. బీజేపీకి రాజీనామా చేసిన సిద్ధూ భార్య ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications